ఘనంగా ఆర్బిఓఎల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు.
జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన జన హృదయ నేత శ్రీనివాసరెడ్డి.
అభిమానుల నుండి భారీగా జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ.
లోకల్ గైడ్/తాండూర్:
ఆర్బిఓఎల్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను తాండూర్ పట్టణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసీ, ఒకరికి ఒకరు తినిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శాలువా పూలదండలతో శ్రీనివాస్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన జన్మదిన పురస్కరించుకొని తాండూర్ పట్టణంలోని భద్రేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సమయంలో పలువురు మాట్లాడుతూ..జననేత, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్న ప్రజానేత, యువత ఉపాధి అవకాశాలకై నిరంతరం కష్టపడే అలుపుఎరగని నాయకుడు.. నాయకులకు కార్యకర్తలకు అనుక్షణం నేనున్నాను అని భరోసా కల్పిస్తూ ఆపదలో ఆపద్బందుడిగా కష్టాలకి సహయంగా ఉంటున్న సహాయకుడు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అని కీర్తించారు. ఈ సందర్భంగా తాండూర్ పట్టణం కాళికాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, వేదపండితులు. అభిషేక , పూజ అనంతరం వేద మంత్రోచ్ఛారణ ద్వారా ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Comment List