చిల్పూర్ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి
లోకల్ గైడ్ తెలంగాణ:చిల్పూర్ మండల కేంద్రంలోని చెల్పూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి వారి కల్యాణ మహోత్సవానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే గారికి పూర్ణ కుంభంతో, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే గారు స్వామి వారి కల్యాణ వేడుకను విక్షించారు. ఆలయ అర్చకులు స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీర్వచనలు అందజేశారు. తదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చిల్పూర్ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి వారి ప్రశస్త్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకువచ్చి ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఈవో, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, భక్తులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comment List