సూర్యాపేట జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కె.నరసింహ
లోకల్ గైడ్ , నల్లగొండ:
సూర్యాపేట జిల్లా నూతన సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) గా కొత్తపల్లి నరసింహ సోమవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు సూర్యాపేట జిల్లా ఎస్పీగా పనిచేసే డిఐజి ప్రమోషన్ పై వరంగల్ పోలీస్ కమిషనర్ గా వెళుతున్న సన్ ప్రీత్ సింగ్ నూతన ఎస్పి నరసింహ కు ఎస్పీగా బాధ్యతలు అప్పజెప్పారు. జిల్లా ఆదనపు ఎస్పీ అడ్మిన్ నాగేశ్వరరావు, ఏ ఆర్ అదనపు ఎస్పీ జనార్ధన్ రెడ్డి నా ఆధ్వర్యంలో స్వాగతం తెలిపారు. సూర్యాపేట జిల్లా ఎస్పి గా నరసింహ కి బాధ్యతలు ఇచ్చి డీఎస్సీ సన్ ప్రీత్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్పీ కి అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, జనార్దన్ రెడ్డి, డి.ఎస్.పి లు రవి, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాసరావు మట్టయ్య, నరసింహ చారి, ఏవో మంజు భార్గవి, సీఐ లు, ఎస్సై లు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం తెలిపి శుభాకాంక్షలు తెలిపినారు.
Comment List