సైబర్‌ నేరగాళ్ల హల్చల్

సైబర్‌ నేరగాళ్ల హల్చల్

లోకల్ గైడ్ :

అమాయకుల నుంచి దోచేస్తున్న సొమ్మును ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలే కీలకంగా మారాయి.కాజేసిన సొమ్మును పలు బ్యాంక్‌ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్‌ చేసి,అవకాశం ఉన్నచోట విత్‌ డ్రా చేసుకుంటున్నారు.అలాకాకపోతే ఆన్‌లైన్‌లో కూపన్ల కొనుగోలు,క్రిప్టో కరెన్సీలోకి మార్చి విదేశాలకు పంపుతున్నారు.అయితే ఈ అకౌంట్స్‌ కోసం ఎక్కువగా ప్రైవేటు బ్యాంకులకు చెందిన అకౌంట్స్‌నే వాడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.సుమారు 62 శాతం లావాదేవీలు ఈ అకౌంట్స్‌లోనే చేస్తున్నారని వారు పేర్కొన్నారు.బ్యాంకులు పర్సనల్‌ వెరిఫికేషన్‌ లేకుండా కరెంట్‌ ఖాతాను తెరుస్తుండడంతో సైబర్‌ నేరగాళ్లకు అనుకూలమవుతోంది.డేటా ప్రొటెక్షన్‌ యాక్ట్‌ సరిగా అమలు లేకపోవడంతో నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు.ఇటీవల ట్రేడింగ్‌ పేరుతో హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.87.50 లక్షలు కొట్టేసిన ఘటన జరిగింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేసి గుజరాత్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు పలువురు పేర్లతో నకిలీ బ్యాంక్‌ ఖాతాలు తెరిచారు.వీటి ద్వారానే విదేశాల్లో ఉన్న సూత్రధారులు బాధితుల నుంచి నగదు వసూలు చేసినట్లు గుర్తించారు.ఈ ఖాతాల ద్వారా రూ.8 కోట్ల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.హైదరాబాద్‌ కు చెందిన ఓ రిటైర్డ్‌ ఎంప్లాయ్‌కు ఫేస్‌బుక్‌ ద్వారా ఫైనాన్షియల్‌ ట్రేడింగ్‌కు సంబంధించి ఒక రిక్వెస్ట్‌ వచ్చింది.మొదట 40 వేలు డిపాజిట్‌ చేస్తే లాభాలు రావడంతో 10 లక్షల రూపాయలు నేరగాళ్లు చెప్పిన వివిధ బ్యాంక్‌ ఖాతాలలో జమచేశాడు. ఆ తర్వాత నేరగాళ్లు రెస్పాండ్‌ కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.ఈ ఖాతాలకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేసినప్పుడు అవి నకిలీ పేర్లతో ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
లోకల్ గైడ్ ,హైదరాబాద్, ప్రతినిధి: ఇటీవలే అనారోగ్యానికి గురై విశ్రాంతి తర్వాత కోలుకుని పార్లమెంట్ కు హాజరైన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ను...
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.
సింహం డ్రెస్ వేసుకొని సింహాల దగ్గరికి వెళ్లిన వ్యక్తి!.. చివరికి ఏమైందంటే?
అర్జున్‌ S/O వైజయంతి టీజర్ విడుద‌ల‌..
బీసీసీఐ నిబంధనలపై కోహ్లీ అసంతృప్తి
ఐపీఎల్ కోసం పీఎస్ఎల్ కాంట్రాక్టు బ్రేక్‌
నాని సినిమాకి ఊహించని కలెక్షన్లు!... తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు?