పాండురంగాపురం - మల్కాన్‌గిరి రైల్వే లైన్ మంజూరుకు మంత్రి తుమ్మల కృతజ్ఞతలు
సారపాక (భద్రాచలం) వరకు తక్షణమే నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరిన మంత్రి
సత్తుపల్లి-కొవ్వూరు, పెనుబల్లి-కొండపల్లి రైల్వే ప్రాజెక్టుల మంజూరుకు లేఖ
ఖమ్మం (లోకల్ గైడ్ తెలంగాణ)
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, పాండురంగాపురం - మల్కాన్‌గిరి రైల్వే లైన్ మంజూరు చేసినందుకు కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్విన్ వైష్ణవ్ కి కృతజ్ఞతలు తెలిపారు.హైదరాబాద్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చే లేఖ అందచేతఈ రైల్వే మార్గాన్ని సారపాక (భద్రాచలం) వరకు త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు అమలయితే భద్రాచలానికి తరలి వచ్చే భక్తులకు మరింత సౌకర్యం లభిస్తుందని, యాత్రికుల సంఖ్య పెరిగే అవకాశముందని మంత్రి పేర్కొన్నారు.గోదావరి నదిపై నిర్మించాల్సిన రైల్వే బ్రిడ్జి పనులను కూడా వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. ముందుగా సారపాక వరకు రైల్వే లైన్‌ను పూర్తిచేస్తే, భక్తులు రైలు మార్గంలో సారపాక చేరుకుని, అక్కడి నుంచి బస్సులు మరియు ఇతర రవాణా సదుపాయాల ద్వారా భద్రాచలానికి చేరుకునే వీలుంటుందని వివరించారు.
ఈ సందర్భంగా, సత్తుపల్లి - కొవ్వూరు మరియు పెనుబల్లి (ఖమ్మం) - కొండపల్లి (అమరావతి) వరకు కొత్త రైల్వే లైన్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని లేఖ ద్వారా కోరారు.
Comment List