ప్ర‌ధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి బేటీ....

ప్ర‌ధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి బేటీ....

లోక‌ల్ గైడ్ :

తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మిక‌త మూసీ న‌దితో ముడిప‌డి ఉంద‌ని... రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రం మ‌ధ్య‌గా మూసీ ప్ర‌వ‌హిస్తోంద‌ని.. అంత ప్రాధాన్యం ఉన్న మూసీ పున‌రుజ్జీవ‌నానికి స‌హ‌క‌రించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఈసా, మూసా న‌దుల సంగ‌మంలో ఉన్న బాపూ ఘాట్ అభివృద్ధి, మూసీ ప్రక్షాళ‌న‌కు 27 ఎస్టీపీల నిర్మాణం, మూసీ రిటైనింగ్ వాల్స్‌, క‌ర‌క‌ట్ట‌ల నిర్మాణం, మూసీ గోదావ‌రి న‌దుల అన‌సంధానంతో క‌లిపి మొత్తంగా ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు ఆర్థిక సహాయం అంద‌జేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు. గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్ట్ కు 222.7 ఎక‌రాల ర‌క్ష‌ణ భూముల బ‌దిలీకి స‌హ‌క‌రించాల‌ని పీఎంకు ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ‌కు 61 ఐపీఎస్ కేడ‌ర్ పోస్టులు వ‌చ్చాయ‌ని, 2015లో రివ్యూ త‌ర్వాత మ‌రో 15 పోస్టులు అద‌నంగా వ‌చ్చాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సైబ‌ర్ నేరాలు, డ్ర‌గ్స్ కేసులు పెరగ‌డం, రాష్ట్రంలో పెరిగిన ప‌ట్ట‌ణాలు, ఇత‌ర అవ‌స‌రాల దృష్ట్యా తెలంగాణ‌కు అద‌నంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాల‌ని పీఎం మోదీని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
సెమీ కండ‌క్ట‌ర్ల ప‌రిశ్ర‌మ ఏర్పాటుకు అనువైన ప‌రిస్థితులు తెలంగాణ‌లో ఉన్నందున ఇండియా సెమీ కండ‌క్ట‌ర్ మిష‌న్ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు అన‌మ‌తించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ముఖ్య‌మంత్రి వెంట రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు ఉన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు