ఉత్తరాదిలో మూడో భాష ఏది..?కేంద్రానికి తమిళనాడు సీఎం స్టాలిన్‌ ప్రశ్న 

ఉత్తరాదిలో మూడో భాష ఏది..?కేంద్రానికి తమిళనాడు సీఎం స్టాలిన్‌ ప్రశ్న 

లోకల్ గైడ్:

జాతీయ విద్యావిధానం అమలు విషయంలో కేంద్రం,తమిళనాడు ప్రభుత్వం మధ్య ఒకరకంగా యుద్ధమే జరుగుతోంది. జాతీయ విద్యావిధానం అమలు విషయంలో కేంద్రం,తమిళనాడు ప్రభుత్వం మధ్య ఒకరకంగా యుద్ధమే జరుగుతోంది.కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని స్టాలిన్‌ ప్రభుత్వం ముందు నుంచీ వ్యతిరేకిస్తూ వస్తోంది.తమిళనాడు ప్రభుత్వం నిర్ణయంపై పలు వర్గాల నుంచి మద్దతు లభిస్తుండగా..మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు.తమిళనాడులో విద్యార్థులకు మూడో భాషను నేర్చుకోవడానికి ఎందుకు అనుమతించడం లేదని కొందరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.ఈ విషయంపై సీఎం స్టాలిన్‌ తాజాగా స్పందించారు.మూడు భాషల ఫార్ములాను తాను వ్యతిరేకిస్తున్నట్లు స్టాలిన్ మరోసారి స్పష్టం చేశారు.తమిళనాడు విద్యార్థులు మూడో భాషను నేర్చుకునేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారంటూ మమ్మిల్ని ప్రశ్నిస్తున్నారు.మరి ఉత్తరాదిలో మూడో భాషగా దేనిని నేర్పుతున్నారో మాత్రం చెప్పరెందుకు..? అక్కడ రెండు భాషలను మాత్రమే బోధిస్తున్నట్లయితే ఇక్కడ మాత్రం మూడు భాషాలను నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది..?అని కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని సీఎం స్టాలిన్‌ నిలదీశారు.త్రిభాషా సూత్రం ప్రకారం ఉత్తరాదిన ఏ భాష నేర్పిస్తున్నారో చెప్పాలని కేంద్రాన్ని స్టాలిన్ డిమాండ్ చేశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కోహ్లిని దాటేసిన హార్దిక్ పాండ్య కోహ్లిని దాటేసిన హార్దిక్ పాండ్య
లోకల్ గైడ్: భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ఇన్స్టాగ్రామ్లో కోహ్లి రికార్డును దాటేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత కప్లో దిగిన ఫొటోను పాండ్య పోస్ట్...
చిల్పూర్ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి
సీఎం సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలి....
మహిళా హక్కుల సారధి ఐద్వా పోరాటాలతోనే సాధికారత సాధ్యం. .
అన్నం సేవా ఫౌండేషన్ లో అన్నదాన కార్యక్రమం. 
సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కళాశాలలో విద్యార్థి మృతి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి..
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం