నూత‌న సాంకేతిక ప‌రిజ్ఞానాలు రెండు వైపులా ప‌దునున్న క‌త్తిలాంటివి : కేటీఆర్

నూత‌న సాంకేతిక ప‌రిజ్ఞానాలు రెండు వైపులా ప‌దునున్న క‌త్తిలాంటివి : కేటీఆర్

లోక‌ల్ గైడ్ :

నూత‌న సాంకేతిక ప‌రిజ్ఞానాలు రెండు వైపులా ప‌దునున్న క‌త్తిలాంటివి అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. టెక్నాలజీని బాధ్యతాయుతంగా వాడుకోకుంటే భారీ విధ్వంసం జ‌రిగే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. డ్రోన్ టెక్నాలజీని వ్యవసాయానికి వాడుకోవచ్చు, యుద్ధానికి వాడుకోవచ్చు నిర్ణయించుకోవాల్సింది మనమే అని పేర్కొన్నారు. అందరికీ సాంకేతిక అక్షరాస్యత (డిజిటల్ లిటరసీ) లేకుంటే అందరికీ సమాన అవకాశాలు అందించలేమని తెలిపారు. దేశంలో సైబర్ నేరాలు, ఆన్‌లైన్ జూదం ఘోరాలు భారీగా పెరుగుతున్నాయని తెలిపారు. కేవలం కాలర్ ట్యూన్ పెట్టి వీటిని అరికట్టలేం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News