అన్నక్యాంటీన్లు తెచ్చి పేదల ఆకలి తీరుస్తున్నాం:గవర్నర్ నజీర్ అహ్మద్ 

అన్నక్యాంటీన్లు తెచ్చి పేదల ఆకలి తీరుస్తున్నాం:గవర్నర్ నజీర్ అహ్మద్ 

లోకల్ గైడ్:

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరంభమయ్యాయి. గవర్నర్ నజీర్ అహ్మద్ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు సాధించిన విజయాలను ప్రస్తావించారు. గత ప్రభుత్వ వైఫల్యాల గురించి వివరించారు. ఏపీ భవిష్యత్ కోసం ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైందని వ్యాఖ్యానించారు. పథకాల గురించి గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావన చేస్తూ తల్లికి వందనం అమలు పైన స్పష్టత ఇచ్చారు. సంక్షేమం - అభివృద్ధి కి కట్టుబడి ఉందని గవర్నర్ నజీర్ అహ్మద్ స్పష్టం చేసారు. తల్లికి వందనం అమలు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రసంగంలో గవర్నర్ నజీర్ అహ్మద్ కీలక అంశాలను ప్రస్తావిం చారు. కూటమికి ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ గురించి వివరించారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయిందని చెప్పారు. సూపర్‌ సిక్స్‌ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామని గవర్నర్ వివరించారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందన కింద ప్రతీ మహిళ కు రూ 15 వేలు ఇవ్వటంతో పాటుగా అన్ని హామీలు అమలవుతాయని చెప్పుకొచ్చారు. చెప్పినట్లు గానే అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు చేశామన్నారు. అన్నక్యాంటీన్లు తెచ్చి పేదల ఆకలి తీరుస్తున్నామని అన్నారు.

 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News