క్రీడలతో యువతకు ఉద్యోగ అవకాశాలు....

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్...

క్రీడలతో యువతకు ఉద్యోగ అవకాశాలు....

కొందుర్గులో ప్రీమియర్ లీగ్ 5  క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

లోకల్ గైడ్ / కొందుర్గు:క్రీడలతో యువత ఉద్యోగ అవకాశాలను సాధ్యం చేసుకోవాలని షాద్ నగర్ ఎమ్మెల్యే పల్లి శంకర్ క్రీడాకారులను ఉద్దేశించి అన్నారు. బుధవారం కొందుర్గు మండలం కేంద్రంలో ప్రీమియర్ లీగ్ 5 క్రికెట్ పోటీలను  లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ. వివిధ గ్రామాల నుంచి పోటిల్లో పాల్గొనడానికి విచ్చేసిన క్రీడాకారులకు ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. మానసిక ఉల్లాసం,సంపూర్ణ ఆరోగ్యం క్రీడాల ద్వారా అలవాటు అవలభించుకోవాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్  కోరారు.భవిష్యత్ లో క్రీడల్లో రాణించడం వలన ఉద్యోగ అవకాశలు కూడా ఉంటాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, క్రీడా కార్పొరేషన్ కి నిధులను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.త్వరలో కొందుర్గు మండల కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో  తెలంగాణ ఒలింపిక్ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, కొండ విజయ్ కుమార్,మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణరెడ్డి, రాజేష్ పటేల్, యాదయ్య, రామయ్య గౌడ్, దామోదర్ రెడ్డి,అక్రమ్, కె కె కృష్ణ,రామకృష, శ్రీధర్ రెడ్డి, యాదయ్య, మల్లేష్ గౌడ్, నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News