భారత క్రికెట్ ప్రేమికులు త్వరలో శుభవార్త వినే ఛాన్స్
లోకల్ గైడ్ : భారత క్రికెట్ ప్రేమికులు త్వరలో ఒక శుభవార్త వినే ఛాన్స్ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా పేసర్ మహ్మద్ షమీ జట్టుకు అందుబాటులోకి వస్తాడని తెలుస్తోంది. 2023 నవంబర్‌లో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత కుడి కాలు మడమకు గాయం కారణంగా షమీ జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఫిబ్రవరి 6 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో షమీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్తలు జోరందుకున్నాయి. కుడి మడమకు శస్త్రచికిత్స చేయించుకున్న షమీని నేషనల్ క్రికెట్ అకాడమీ వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని తెలిసింది. మడమ గాయం నయమైనా, మోకాలిలో స్వల్ప వాపు ఉండటం వల్లే బోర్డర్-గావస్కర్ ట్రోఫీకి అతడ్ని ఎంపిక చేయలేదని టాక్.షమీ గాయం నుంచి పూర్తిగా కోలుకుంటే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసే జట్లలో అతడికి చోటు కల్పించే అవకాశం ఉంది. షమీ ఫిట్‌నెస్ పరిశీలించేందుకు ఆయనతో ఎల్లప్పుడూ జాతీయ క్రికెట్ అకాడమీకి చెందిన ఫిజియో లేదా ట్రైనర్ ఉంటున్నారట. రాజ్‌కోట్‌లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడినప్పుడు కూడా షమీతో ఫిజియో వెళ్లారట.ఇంగ్లండ్‌తో వన్డేలు, టీ20 సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి జట్లను ఎంపిక చేయడానికి జనవరి 12న బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఇంగ్లండ్‌తో భారత్ 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. స్టార్ పేసర్ మహ్మద్ షమీ 417 రోజులుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. వన్డే వరల్డ్‌కప్ సందర్భంగా చీలమండకు గాయం కావడంతో లండన్ వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నాడు.
ఆ తర్వాత కోలుకొని ఫిట్‌నెస్ సాధించి దేశవాళీ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. నిజానికి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి షమీని ఎంపిక చేయాలని సెలక్టర్లు భావించారు. కానీ మోకాలిలో వాపు రావడంవల్ల పక్కన పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత క్రమంగా కోలుకోవడంవల్ల త్వరలో జరగబోయే ఇంగ్లండ్సిరీస్కు, ఛాంపియన్స్ ట్రోఫీకి షమీని సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Comment List