33/11 కెవి విద్యుత్ ఉప కేంద్రాన్నిప్రారంభించిన మంత్రి మల్లు భట్టి విక్రమార్క .....
లోకల్ గైడ్ :వనపర్తి జిల్లా రేవల్లి మండలం తలుపునూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11 కెవి విద్యుత్ ఉప కేంద్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అధారిటీ చైర్మన్ శివసేన రెడ్డితో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ విద్యుత్ ఉప కేంద్రాన్ని రూ. 2.06 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఈ సబ్ స్టేషన్ ద్వారా రేవల్లి మండలంలోని తలుపునూరు గ్రామం, తలుపునూరు తండా, రేవల్లి, కేశంపేట, తుడుకుర్తి గ్రామాల పరిధిలోని గృహ, వ్యవసాయ భూములకు కరెంట్ కష్టాలు తీరనున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ సిఎండి ముషారఫ్ అలీ, జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి, జిల్లా ఎస్పీ గిరిధర్ రావుల, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్, , మహబూబ్నగర్ జిల్లా డీసీసీబీ చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, విద్యుత్ శాఖ సీఈ యు. బాలస్వామి, డైరెక్టర్ నందకిషోర్, ఎస్ ఈ రాజశేఖరం, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, జిల్లా అధికారులు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు..
Comment List