మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం..

 టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం

మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం..

లోక‌ల్ గైడ్:తెలంగాణ టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది మార్చి 31 నుంచి వరుస జాబ్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయా శాఖల్లో ఖాళీల వివరాలపై కసరత్తు చేస్తున్నామని, నోటిఫికేషన్ల జారీపై ఏప్రిల్‌లో ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఇక ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా వేగంగా పూర్తి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు..తాజాగా గ్రూప్‌-3 ‘కీ’ విడుదల చేశామని, రెండ్రోజుల్లో గ్రూప్‌ 2 ‘కీ’ కూడా విడుదల చేయనున్నట్టు టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. షెడ్యూల్‌ ప్రకారం ఫలితాలు వచ్చేలా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. వారం, పది రోజుల వ్యవధిలో గ్రూప్ 1, 2, 3 ఫలితాలు కూడా విడుదల చేస్తామన్నారు. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ ఫార్మాట్‌లలో పరీక్షల నిర్వహణ చేపట్టనున్నట్లు నిర్ణయించుకున్నట్లు చెప్పారు. మార్చి 31లోపు పెండింగ్‎లో ఉన్న నోటిఫికేషన్ల ఫలితాలన్నీ విడుదల చేస్తామ‌న్నారు.

 

 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News