విశ్వవికాస్ జూనియర్ కళాశాలలో సైబర్ మోసాలపై అవగాహన సదస్సు
విద్యార్థులకు అవగాహన కలిగించిన జడ్చర్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి
లోకల్ గైడ్ / జడ్చర్ల :
జడ్చర్ల పట్టణంలోని విశ్వవికాస్ జూనియర్ కళాశాలలో జడ్చర్ల పోలీసు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సైబర్ మోసాల అవగాహన సదస్సులో జడ్చర్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆది రెడ్డి పాల్గొని సైబర్ నేరాలు అతివేగం గురించి అవగాహన కల్పించారు.సైబర్ మోసాలు,రోడ్డు ప్రమాదాలు సైబర్ మోసాల గురించి వివరించారు.ఫోన్ కాల్స్, సోషల్ మీడియా, ఫిషింగ్ మెసేజ్‌లు,ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై స్పష్టమైన సూచనలు చేశారు.
వారు సూచించిన ముఖ్యమైన జాగ్రత్తలు: అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దు.వ్యక్తిగత సమాచారం ఎవరికీ పంచుకోకండి.బలమైన పాస్‌వర్డులను ఉపయోగించండి.ఆన్‌లైన్‌లో డబ్బు లావాదేవీలు చేసే ముందు దృవీకరణలు చేయండి.సైబర్ మోసానికి గురైనట్లయితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి.ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సైబర్ భద్రతకు సంబంధించిన ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు ఇచ్చారు.ఈ కార్యక్రమం విద్యార్థులకు ఉపయోగకరంగా నిలుస్తుందని,వారిలో సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని పోలీసులు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్న వెంటనే పోలీసు వారికి సమాచారం అందివ్వాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల పట్టణ సీఐ ఆది రెడ్డి గారు పోలీస్ సిబ్బంది కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్,చంద్రశేఖర్ రెడ్డి,జానకి రాములు గౌడ్,రాజారెడ్డి శివశంకర్,రాములు,రాధిక మేడం,ఆశన్న విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
Comment List