యువ భారత ఆరాధ్య దైవం

   యువ భారత ఆరాధ్య దైవం


లోకల్ గైడ్...

యువ భారత ఆరాధ్య దైవం
++++++++++++++++++++++
భరతమాత ముద్దుబిడ్డ 
భారతీయుల ఆరాధ్య దైవం 
అఖండ భారతదేశానికి ఆదర్శం 
యువతి,యువకులకు మార్గదర్శి 
భారతజాతి ఆణిముత్యం 
యువతలో చైతన్య జ్వాలను రగిలించిన మహావీరుడు అతడే
భారత మాత సంతోషంగా
గర్వపడే యోధుడు అతడే
విజ్ఞానపు వెలుగులను మనలో
వెలిగించిన సూర్యుడు అతడే... 

ప్రపంచానికి వేదాల సారాన్ని
బోధించిన గొప్ప గురువు అతడే 
న్యాయం,ధర్మం కోసం నిరంతరం తపించిన మహాయోగి అతడే
మనుషుల హృదయాలలో ధర్మ కాంక్షను కల్పించిన నరేంద్రుడు 
యువతలో ఆత్మవిశ్వాసాన్ని 
కలిగించిన ధీరుడు ఆతడే
ఓ యువత లేవండి అంటూ జ్ఞాన జ్యోతులను వెలిగించిన గురువు అతడే...

భారతీయుల్లో దేశభక్తిని
కల్పించిన దేశభక్తుడు అతడే 
భరతమాత గర్వపడే ముద్దు బిడ్డ ప్రపంచ దేశాలలో భారత కీర్తి 
జెండాను ఎగురవేసిన స్వామీజీ  
వందల సంవత్సరాలకు సరిపడే 
జ్ఞానాన్ని అందించిన శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యుడు అతడే 
అతడే మన జాతి ఆరాధ్యుడు 
అతడే మన భారత మహా జ్ఞాని
అతడే స్వామి వివేకానందుడు...

వి.జానకి రాములు గౌడ్
 లింగంధన

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News