ప్రజా అవసరాలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం…………

శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ

ప్రజా అవసరాలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం…………

లోకల్ గైడ్ /శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ నల్లగండ్ల హుడా కాలనీ లో రూ.43.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీ సీ రోడ్ల నిర్మాణం పనులకు ఈ రోజు గౌరవ గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి గారు మరియు గౌరవ పీఏసీ చైర్మన్,శేరిలింగంపల్లి శాసన సభ్యులు శ్రీ ఆరెకపూడి గాంధీ గారు ముఖ్యఅతిథిలుగా పాల్గొని శంఖుస్థాపన చేశారు.ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ కార్పొరేటర్ శ్రీ గంగాధర్ రెడ్డి గారిని,మరియు పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు శ్రీ ఆరెకపూడి గాంధీని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ శరవేగంగా విస్తరిస్తున్న గచ్చిబౌలి డివిజన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రతీకగా నిలుపుతున్నామని అన్ని అన్నారు.పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డివిజన్ పరిధిలో శరవేగంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు..సమస్యలను ఒక్కొకటిగా అధిగమిస్తూ శాశ్వత పరిష్కారం చూపుతున్నామని అన్నారు.అభివృద్ధి పనులకు నిధుల కొరత లేకుండా ఆదర్శవంతమైన గచ్చిబౌలి డివిజన్ ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రతీ బస్తీ, కాలనీల్లో కోట్ల నిధులు వెచ్చించి మంచినీరు, రోడ్లు, కరెంటు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు.భవిష్యత్తులో జనాభా పెరుగుదలను దృష్టిలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చే దిశగా తమ చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి గారు చెప్పడం జరిగినది.అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం పెరగాలని కోరారు .ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ పరిధి లోనీ రాష్ట్ర, జిల్లా, సీనియర్ నాయకులు,డివిజన్ నాయకులు , మహిళ నాయకులు ,మహిళ కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, జిహెచ్ఎంసి అధికారులు, అభిమానిలు,కాలనీ వాసులు స్థానిక నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News