ఆశ వర్కర్లకు కనీస వేతనం 18000 ఇవ్వాలని
రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతకు సీతక్కకు వినతిపత్రం అందజేత
లోకల్ గైడ్:కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేసి ఆశా వర్కర్లకు కనీస వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని ఈరోజు షాద్నగర్కు వచ్చిన శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎన్ రాజు ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమక్షంలో క్యాంపు కార్యాలయంలో మంత్రికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఎన్ రాజు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల పరిపాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఆశ వర్కర్లను నమ్మించి మోసం చేసిందని ఆయన గత ప్రభుత్వాన్ని విమర్శించారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ సమావేశాలలో ఆశ వర్కర్ల గురించి అంగన్వాడీల గురించి మధ్యాహ్న భోజన కార్మికుల గురించి గ్రామపంచాయతీ కార్మికుల గురించి చర్చించి కార్మికులకు సమానం పనికి సమానం వేతనం వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు కార్యక్రమంలో సిఐటియు ఆశా వర్కర్ యూనియన్ జిల్లా కార్యదర్శి మరియు నాయకులు సునీత లలిత రాధిక కేతన పావని షకీలా సుమలత సునీత పుష్ప శ్రీదేవి విజయ తదితరులు పాల్గొన్నారు జిల్లా ఉపాధ్యక్షులు బీస సాయిబాబు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీను నాయక్. రైతు సంఘం నాయకులు పద్మా రెడ్డి సిఐటియు నాయకులు రాయి కంటి గోపాల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..
Comment List