ఉమ్మడి నిజామాబాద్లో పర్యటిస్తున్న వ్యవసాయ ,రైతు సంక్షేమ కమిషన్.....
పసుపులో రకాలను పరిశీలిస్తున్న TGAFWC చైర్మన్ మరియు సభ్యులు, సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి....
లోకల్ గైడ్ :నిజామాబాద్ జిల్లాలో పసుపు సాగు చేసే తోటలను పరిశీలించిన కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు గోపాల్ రెడ్డి, కెవిఎన్ రెడ్డి, భవానీ రెడ్డి, గడుగు గంగాధర్ తోపాటు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. పసుపు సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తీసుకుంది కమిషన్ బృందం. భూమిలో నుండి పసుపు కొమ్ములను తీసి ఆరబెట్టి, ఉడకబెట్టి మార్కెట్ కు తరలించే వరకు మొత్తం ప్రాసెస్ ను కమిషన్ కు వివరించారు పసుపు సాగు రైతులు,గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు.అనంతరం కమ్మరి పల్లిలో వున్న రీసర్చ్ స్టేషన్ ను విజిట్ చేసింది కమిషన్ బృందం. పసుపు సాగు కోసం వాడే విషనరీలని అన్ని పరిశీలించారు.పసుపు రైతులకు భరోసా గా ఉంటామని కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు సభ్యులు హామీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాకు వచ్చిన రైతు కమిషన్ను పసుపు రైతులు ఘనంగా స్వాగతం తెలిపారు. పసుపు సాగులో వేరేటీలను కమిషన్ ముందు ప్రదర్శించారు పసుపు రైతులు.
Comment List