అంగన్వాడీల వేతనాలు వెంటనే చెల్లించాలి....

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బుద్ధుల జంగయ్య డిమాండ్

అంగన్వాడీల వేతనాలు వెంటనే చెల్లించాలి....

అంగన్వాడి సమస్యలను పరిష్కరించాలంటూ సీనియర్ అసిస్టెంట్ ప్రకాష్ కు వినతి పత్రం అందజేత.

లోకల్ గైడ్/ కొందుర్గు : ప్రభుత్వం అంగన్వాడి టీచర్లు అండ్ హెల్పర్ వేతనాలను వెంటనే చెల్లించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బు ద్దుల జంగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనియన్ ఫెడరేషన్ ఏఐటీయూసీ జాతీయ సమితి పిలుపు మేరకు  మంగళవారం  కొందుర్గు తాసిల్దార్ ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ ప్రకాష్ కు వినతి పత్రం ఇవ్వడం అందజేశారు. ఏఐటీయూసీ మండల అధ్యక్షులు బాగళ్ల నరసింహ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య మాట్లాడుతూ ఎన్నికల ముందు అంగన్వాడి టీచర్ల ఆయాల సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత వరకు కూడా వారి సమస్యలు పట్టకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. 50 సంవత్సరాల నుంచి చాలీచాలి వేతనాలతో పనిచేసిన అంగన్వాడీలను రిటైర్మెంట్ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం అనేది సరైన పద్ధతి కాదన్నారు. అంగన్వాడీ లందరికీ కనీస వేతన చట్టం ప్రకారం 26000 ఇవ్వాలని రిటైర్మెంట్ అయినా టీచర్ల స్థానంలో గ్రాడ్యుయేట్స్అనుభవజ్ఞులైన ఆయాలను ఆ సెంటర్లలో టీచర్లు స్థానంలో పెట్టి పని చేయిస్తున్నారు. వారికి ఆయాల వేతనమే ఇస్తున్నారు. టీచర్లతో సమానంగా వేతనం ఇవ్వాలని ఆయన కోరారు .ప్రభుత్వం ప్రకటించినట్టుగా టీచర్లకు రెండు లక్షలు ,ఆయాలకు లక్ష, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాల డిమాండ్ చేశారు. అలాగే గ్యాస్ బిల్లు కూరగాయల బిల్లు అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. అంగన్వాడిసమస్యలతో కూడిన విన్నతి పత్రాన్ని ఎమ్మార్వో ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ ప్రకాష్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడి మండల అధ్యక్షురాలు యామిని ,కార్యదర్శి సువర్ణ, నాయకురాలు మనెమ్మ శ్రీలత ప్రమీల,రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్
లోక‌ల్ గైడ్ :  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్.స్పోర్ట్స్ పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్న...
దేశ భవిష్యత్తు యువతతో మారుతుంది -  ABVP
మ‌రో దిగ్గజ ఆగటాడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
మాజీ ఎంపీపీ సుదర్శన్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 
సేవాలాల్ సేన  నూతన గ్రామ కమిటీ 
సంబరాలు ఎక్కడ ఓ మనిషి?
విశాఖ‌కు చేరుకున్న ప్ర‌ధాని మోదీ...