తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లకు బ్రేక్ .......
లోకల్ గైడ్: మందు బాబులకు షాకింగ్ న్యూస్ ఇది. తెలంగాణకు కింగ్ ఫిషర్ల బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ స్పష్టం చేసింది. తెలంగాణ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ బకాయిలు చెల్లించకపోవడంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూబీఎల్ ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం బీర్ల ధరలను పెంచింది కానీ.. తయారీదారులకు చెల్లించే బేస్ ధరను పెంచకపోవడంతో భారీ నష్టాలు వస్తున్నాయని యూబీఎల్ తెలిపింది. బీర్ల సరఫరా నిలిపివేతకు ఇది కూడా ఒక కారణమని కంపెనీ పేర్కొంది. తెలంగాణ నుంచి రూ. 900 కోట్లు రావాల్సి ఉందని పేర్కొంది. ఈ జాప్యం కూడా కంపెనీ నష్టాలకు కారణమైందని తెలిపింది. ఈ విషయాన్ని సెబీకి లేఖ ధ్వారా తెలిపింది.కింగ్ ఫిషర్, కింగ్ ఫిషర్ స్ట్రాంగ్, కింగ్ ఫిషర్ అల్ట్రా, కింగ్ ఫిషర్ అల్ట్రా మ్యాక్స్‌తో పాటు ఇతర బ్రాండ్లను నిలిపివేస్తున్నట్లు యూబీఎల్ స్పష్టం చేసింది. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో బీర్ల అమ్మకాలను పరిశీలిస్తే కింగ్ ఫిషర్ బ్రాండ్స్ 60 నుంచి 70 శాతం అధికంగా విక్రయం అవుతున్నట్లు తెలిపింది.
Comment List