సంబరాలు ఎక్కడ ఓ మనిషి?
సంబరాలు ఎక్కడ ఓ మనిషి?
+++++++++++++++++++++
అరెరే!! ఏమైంది ఓ మనిషి
రోజు రోజుకు నీ హృదయం
మరీ ఇరుకైపోతుంది కదా
మానవ సంబంధాలు దూరంగా
ఒంటరితనంతో సంతోషంగా పడుతున్నావా! మంచితనాన్ని మరిచిపోయావా ఓ మనిషి...
ఇంటర్ నెట్ ప్రేమలో మునిగి
తేలుతూ సంతోషపడుతున్నావ్
గడచిన కాలం నాటి కష్టాలు
ఇప్పటికీ అలాగనే ఉన్నాయిలే?
పిల్లలను చదివించడం
పిల్లల పెళ్లిళ్లు చేయడం
ఉద్యోగాలు సంపాదించడం కష్టమైపోయే ఓ మనిషి...
కుటుంబంతో కలిసి ఆనందంగా భోజనం చేయడం ఇవన్నీ
కలలుగానే మిగిలిపోయే
రైతు రాజు కావడం ఎప్పుడూ? కనీసం తను సంతోషంగా జీవించలేకపోతున్నాడు...
దోపిడి దొంగల నడుమ ఆనందంగా జీవనం సాగించలేకపోతున్నావా
ప్రభుత్వాలెన్ని మారినా!
పాలకులు ఎన్ని చెప్పినా!
మధ్యతరగతి ప్రజల బ్రతుకు ఎక్కడ వేసిన గొంగడిలా అక్కడనే ఉన్నవి
ఎవరెన్ని మాట్లాడిన,ఎవరెన్ని
చెప్పినా ఇవన్నీ నిజాలే!...
మనశ్శాంతిగా మనిషి జీవిత
ప్రయాణం కొనసాగించినప్పుడే
మనిషి సంబరాలను సంతోషంగా జరుపుకున్నప్పుడే కదా పండుగ సందడి ప్రతి ఇంట జరుగును కదా...
వి. జానకి రాములు గౌడ
లింగంధన
Comment List