మ‌రోసారి తెలంగాణ నేప‌థ్యంతో రానున్న సాయిప‌ల్ల‌వి

మ‌రోసారి తెలంగాణ నేప‌థ్యంతో రానున్న సాయిప‌ల్ల‌వి

లోక‌ల్ గైడ్ :
 తెలంగాణ సంస్కృతి, బంధాలు, భావోద్వేగాల నడుమ సాగే బలమైన కథతో ‘బలగం’ తీసి, భారీ హిట్‌ను అందుకున్న దర్శకుడు వేణు యెల్దండి.. త్వరలో ‘ఎల్లమ్మ’ కథతో రానున్నారు. దిల్‌రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నితిన్‌ కథానాయకుడు. కథానాయికగా సాయిపల్లవి దాదాపు ఖరారైనట్లు తెలుస్తున్నది. ఇటీవలే ఆమె కథ కూడా విన్నదట. ‘బలగం’ కథను మించిన ఎమోషన్స్‌ ‘ఎల్లమ్మ’లో ఉంటాయని తెలుస్తున్నది. తెలంగాణ సంస్కృతిలో గ్రామ దేవతల ఆరాధన ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ ఎల్లమ్మ, పెద్దమ్మ, మైసమ్మ, పోశమ్మ.. ఇలా విభిన్నమైన నామాలతో గ్రామదేవతలు దర్శనమిస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోనూ గంగానమ్మ, పోలేరమ్మ, అంకాళమ్మ.. ఇలా రకరకాల రూపాల్లో గ్రామదేవతలు పూజలందుకుంటున్నారు.ఈ గ్రామదేవతల నేపథ్యాన్ని తీసుకొని, వారిచుట్టూ తెలంగాణ నేపథ్యంలో దర్శకుడు వేణు యల్దండి ఈ కథ అల్లారని వినికిడి. అయితే.. ఇదేం భక్తిరసచిత్రం కాదు. ‘బలగం’లా ఇదికూడా భావోద్వేగాల ప్రయాణమే. సాయిపల్లవి ఓ సినిమా ఒప్పుకుందంటే కచ్చితంగా అది గొప్పదై ఉంటుందనేది పలువురి అభిప్రాయం. మరి ‘ఎల్లమ్మ’ కథ ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనుల్లో ‘ఎల్లమ్మ’ టీమ్‌ బిజీగా ఉంది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు పెట్టనున్నారట. ఈ చిత్రానికి సాయిమాధవ్‌ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్
లోక‌ల్ గైడ్ :  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్.స్పోర్ట్స్ పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్న...
దేశ భవిష్యత్తు యువతతో మారుతుంది -  ABVP
మ‌రో దిగ్గజ ఆగటాడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
మాజీ ఎంపీపీ సుదర్శన్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 
సేవాలాల్ సేన  నూతన గ్రామ కమిటీ 
సంబరాలు ఎక్కడ ఓ మనిషి?
విశాఖ‌కు చేరుకున్న ప్ర‌ధాని మోదీ...