మరో దిగ్గజ ఆగటాడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
లోకల్ గైడ్: న్యూజిలాండ్ దిగ్గజ ఆగటాడు మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్.. 14 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. 2022 అక్టోబర్‌లో గప్టిల్ చివరిసారిగా న్యూజిలాండ్ తరఫున ఆడాడు. గప్టిల్ న్యూజిలాండ్ తరఫున మూడు ఫార్మాట్‌ల్లో కలిపి మొత్తం 367 మ్యాచ్‌లు ఆడాడు. కెరియర్‌లో 23 సెంచరీలు సాధించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోనూ తన సత్తాచాటుకున్నాడు. న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు గప్టిల్. 122 మ్యాచుల్లో 3561 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 7,346 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. గప్టిల్ కంటే ముందు రాస్ టేలర్, స్టీఫెన్ ఫ్లెమింగ్ ఉన్నారు. అరంగేట్రం చేసిన తొలి వన్డేలోనే సెంచరీ సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌గా ఘనత సాధించాడు. 2009లో వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీని నమోదు చేశాడు.2015 ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్‌లో వెస్టిండిస్‌పై డబుల్ సెంచరీ సాధించాడు. అతని కెరియర్‌లోనే ఇది అద్భుతమైన ఇన్నింగ్స్‌లో ఇది ఒకటి. ప్రపంచ కప్‌లో ఒక బ్యాట్స్‌మెన్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు. వన్డేల్లోనూ డబుల్ సెంచరీ చేసిన తొలి న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డులు సృష్టించాడు. క్వార్టర్ ఫైనల్‌లో వెస్టిండిస్‌పై 136 బంతుల్లో 237 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 24 ఫోర్లు, 11 సిక్సర్లతో వెస్టిండిస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. గప్టిల్ 2013లో ఇంగ్లండ్‌పై అజేయంగా 189 పరుగులు.. 2017లో దక్షిణాఫ్రికాపై 180 పరుగులు చేశాడు. గప్టిల్ టీ20లో రెండు సెంచరీలు నమోదు చేశాడు. 2012లో దక్షిణాఫ్రికాపై 69 బంతుల్లో అజేయంగా 101 పరుగులు చేయగా.. 2018లో ఆస్ట్రేలియాపై 54 బంతుల్లో 105 రన్స్ బాదాడు. గప్టిల్ టెస్టుల్లోనూ ఆకట్టుకున్నాడు. 47 మ్యాచ్‌ల్లో 2,586 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో మూడు సెంచరీలు చేశాడు. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 189 పరుగులు. 2010లో బంగ్లాదేశ్‌పై అజేయ సెంచరీ చేశాడు. 2011లోనూ జింబాబ్వేపై 109 పరుగులు చేయగా.. 2015లో శ్రీలంకతో జరిగిన టెస్టులో 156 పరుగులు చేశాడు.
Comment List