రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి

కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి 

రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి

స్వయంగా రక్తదానం చేసిన కలెక్టర్

లోక‌ల్ గైడ్ : రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణదాతలుగా నిలవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా  కరీంనగర్ బస్ స్టేషన్ లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి రక్తదానం చేశారు. రక్తదానం చేసిన పలువురు డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు. సరైన సమయంలో రక్తం లభించక మరణాలు సంభవించే అవకాశం ఉందని, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రాజు, డిప్యూటీ రీజినల్ మేనేజర్ భూపతి రెడ్డి, డిపో మేనేజర్లు విజయ మాధురి, మల్లయ్య, ఏవో మనోహర్ రెడ్డి, పిఓ చంద్రయ్య, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కేశవరెడ్డి పాల్గొన్నారు.

 

 

 

 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్
లోక‌ల్ గైడ్ :  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్.స్పోర్ట్స్ పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్న...
దేశ భవిష్యత్తు యువతతో మారుతుంది -  ABVP
మ‌రో దిగ్గజ ఆగటాడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
మాజీ ఎంపీపీ సుదర్శన్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 
సేవాలాల్ సేన  నూతన గ్రామ కమిటీ 
సంబరాలు ఎక్కడ ఓ మనిషి?
విశాఖ‌కు చేరుకున్న ప్ర‌ధాని మోదీ...