చేవెళ్ల రాజకీయంగా చైతన్యవంతమైన నియోజకవర్గం: సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్
చేవెళ్ల మండలం ముడిమ్యాల్ నుండి మేడిపల్లి వరకు రూ. 24 కోట్లతో అభివృద్ధి చేసే రోడ్డు కు రాష్ట్ర రోడ్లు & భవనాలు శాఖా మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఈరోజు శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్.శాసనమండలి చీఫ్ విప్ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల శాసనసభ్యులు శ్రీ కాలే యాదయ్య, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, ప్రజలు. అంతకు ముందు చేవెళ్ల పట్టణంలో PACS కోఆపరేటివ్ సొసైటీ భవనాన్ని ప్రారంభించిన అతిధులు.ఈ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ....కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు భోళా శంకరుడు, ఏమి అడిగినా కాదనకుండా ఇస్తాడు.మా వికారాబాద్ నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ. 150 కోట్లు మంజూరు చేశారు.కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సుపరిచితులు.వికారాబాద్ నియోజకవర్గం నుండి వెళ్ళుతున్న నాలుగు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి పదివేల కోట్లతో అభివృద్ధి చేయాలని కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం పదేళ్ళ పాలనలో రంగారెడ్డి జిల్లాలో రోడ్ల అభివృద్ధి జరగలేదు. ప్రజా ప్రభుత్వం వచ్చాకే ఇప్పుడు కావలసినన్ని నిధులు వస్తున్నాయి.
చేవెళ్ల రాజకీయంగా చైతన్యవంతమైన నియోజకవర్గం.స్వర్గీయ కొండా వెంకట రంగారెడ్డి, ఇంద్రారెడ్డి వంటి రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఇది.మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖరెడ్డి గారు తను ఏ పని ప్రారంభించినా చేవెళ్ల సెంటిమెంట్ గా ఇక్కడి నుండి ప్రారంభించేవారు.నాడు వైయస్ రాజశేఖర రెడ్డి గారి హయంలో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు తోనే రంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి పరుగులు మొదలయ్యాయి. శంషాబాద్ విమానాశ్రయం నిర్మాణంతో ఈ ప్రాంతంలోని భూములకు మంచి ధరలు వచ్చాయి, రియల్ ఎస్టేట్ కూడా పెరిగింది, ఈ అభివృద్ధి అంతా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోనే జరిగింది.గత ప్రభుత్వం పదేళ్ళలో చేసింది ఏమి లేదు, రూపాయి పని చేసి వంద రూపాయల ప్రచారం చేసుకున్నారు, అంతా డొల్లనే, ఇప్పుడు చూస్తే అన్ని అప్పులే.తప్పు చేసి బయటపడితే సిగ్గుపడాల్సింది పోయి దభాయిస్తున్నారు.ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ సమర్ధవంతంగా పనిచేస్తున్నది.ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్య శ్రీ పది లక్షలకు పెంపు అమలవుతున్నాయి.ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలో ఒక్క వ్యవసాయ రంగానికే యాబై నాలుగు వేల కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసింది. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విదంగా ఇరవై అయిదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసింది. గత ప్రభుత్వ ముఖ్యమంత్రి లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేయడం కూడా కుదరదు అని చెప్పాడు. కాని దమ్మున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేసి మాటలు కాదు చేతల ముఖ్యమంత్రిని అని నిరూపించుకున్నాడు.
Comment List