ఆ పేరును పక్కన పెడుతున్నా..... త‌మిళ‌నాడు సిఎం  

 ఆ పేరును పక్కన పెడుతున్నా..... త‌మిళ‌నాడు సిఎం  

లోక‌ల్ గైడ్ : అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిన ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అసెంబ్లీ వేదికగా స్పందించారు. ఈ అంశాన్ని అడ్డంపెట్టుకుని కొందరు సభ్యులు మాటిమాటికి అన్నా యూనివర్సిటీ పేరు ప్రస్తావించడాన్ని ఆయన తప్పుపట్టారు. యూనివర్సిటీలో విద్యార్థినిపై జరిగిన దారుణం ఎవరికీ ఆమోదయోగ్యం కాదని, అది దారుణమని వ్యాఖ్యానించారు.
‘సభలో చాలామంది సభ్యులు ఒక యూనివర్సిటీ పేరును ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నారు. కానీ నేను ఆ యూనివర్సిటీ పేరును ప్రస్తావించదల్చుకోలేదు. నేను ఆ పేరుకు కళంకం తేవాలనుకోవడం లేదు. ఎందుకంటే ఈ సభలో ఉన్నవారిలో చాలామందిని తయారు చేసింది ఆయనే. ఆ భావోద్వేగంతో నేను ఆ పేరును పక్కన పెడుతున్నా. చెన్నైలో విద్యార్థినిపై జరిగిన ఘటనను ఎవరూ ఆమోదించరు. విద్యార్థినిపై లైంగిక దాడి కౄరమైన చర్య’ అని స్టాలిన్‌ వ్యాఖ్యానించారు.‘సభలోని సభ్యులంతా లైంగిక దాడి ఘటనపై మాట్లాడారు. ఒక్కరు తప్ప మిగతా అందరూ నిజమైన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని చెడుగా చూపించడమే ఆ ఒక్క సభ్యుడి పని. కానీ నేను ఒక్కటే చెబుతున్నా. మా ప్రభుత్వం బాధితురాలికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటుంది. నేరం జరిగిన తర్వాత నిందితుడిని అరెస్ట్‌ చేయకపోయినా, అతడిని కాపాడే ప్రయత్నాలు జరిగినా ప్రభుత్వాన్ని నిందించవచ్చు. నిందితుడిని వెంటనే అరెస్ట్‌ చేసినా, వేగంగా విచారణ చేయిస్తున్నా ప్రభుత్వాన్ని నిందించడమనేది రాజకీయ ప్రయోజనాల కోసమే’ అని స్టాలిన్‌ ఆరోపించారు.అన్నా యూనివర్సిటీలో ఇటీవల 19 ఏళ్ల విద్యార్థినిపై గణశేఖరన్‌ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు క్యాంపస్‌ భవనం వెనుకాల తన స్నేహితుడితో మాట్లాడుతుండగా నిందితుడు చూశాడు. ఆమె స్నేహితుడిని బెదిరించి వెళ్లగొట్టి ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఘటనపై విద్యార్థిని తన స్నేహితునితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటికి వచ్చింది. ఈ ఘటన తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్
లోక‌ల్ గైడ్ :  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్.స్పోర్ట్స్ పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్న...
దేశ భవిష్యత్తు యువతతో మారుతుంది -  ABVP
మ‌రో దిగ్గజ ఆగటాడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
మాజీ ఎంపీపీ సుదర్శన్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 
సేవాలాల్ సేన  నూతన గ్రామ కమిటీ 
సంబరాలు ఎక్కడ ఓ మనిషి?
విశాఖ‌కు చేరుకున్న ప్ర‌ధాని మోదీ...