.....ధర్మమే జీవితం.....

.....ధర్మమే జీవితం.....

.....ధర్మమే జీవితం.....
-----------------------------------

లోకల్ గైడ్ :-----

ధర్మమే మనందరికీ
వెలుగును చూపే దీపం 
ధర్మమే మన ఆయుధం
ధర్మమే మన దివ్య ఔషధం
ధర్మం అనేది లేకుంటే? 
విజయం పొందలేరు 
ధర్మ రక్షణే మన ధర్మం... 

ధర్మంగా చదువుకుంటే 
విజ్ఞానం కలుగునులే  
ధర్మాన్ని పాటిస్తే ఆనందమే 
అధర్మానికి భయపడితే
విజయం సాధించలేం 
కష్టాలకు భయపడితే
ఫలితం ఎప్పటికీ పొందలేం...

ధర్మంగా ప్రయత్నం
చేస్తే అన్ని సాధ్యమే 
ధర్మంగా లేకుంటే ఉన్నత
శిఖరాలను చేరుకోలేం?
అధర్మానికి భయపడితే
ఎవరమైన గెలవలేం 
ధర్మంగా జీవిస్తే జీవితం
సంతోషంగా సాగునులే...

ఓర్పుతో నిత్యం నేర్పుగా
ధర్మంగా దీక్షతో కష్టపడితే 
ఫలితము దక్కునులే
ధర్మంగా విక్రమార్కుడిలా 
ప్రయత్నం మొదలుపెడితే? 
గొప్ప ఫలితం కలుగునులే
ఓ మనిషి నిజం తెలుసుకో 
సత్యం,ధర్మం మరువకు...

వి.జానకి రాములు గౌడ్
లింగంధన

 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్
లోక‌ల్ గైడ్ :  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్.స్పోర్ట్స్ పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్న...
దేశ భవిష్యత్తు యువతతో మారుతుంది -  ABVP
మ‌రో దిగ్గజ ఆగటాడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
మాజీ ఎంపీపీ సుదర్శన్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 
సేవాలాల్ సేన  నూతన గ్రామ కమిటీ 
సంబరాలు ఎక్కడ ఓ మనిషి?
విశాఖ‌కు చేరుకున్న ప్ర‌ధాని మోదీ...