సందయ్య మెమోరియల్ ట్రస్ట్ అందించే స్టడీ మెటీరియల్ తో బాగా చదువుకొని
విద్యార్థులు 100% శాతం ఉత్తీర్ణత సాధించాలి--- రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
లోకల్ గైడ్ శేరిలింగంపల్లి:సమాజంలో ఎంతో మంది ధనవంతులు ఉన్నారు కానీ ఉదార భావంతో సేవ చేయాలనే సదుద్దేశంతో వారు సంపాదించే సంపాదనలో 5% శాతం సమాజ సేవకు ఖర్చు చేస్తే మన దేశం ,రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర నాయకులు ట్రస్ట్ సెక్రటరీ రవికుమార్ యాదవ్ గారు తెలుపుతూ
ఈరోజు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం లో భాగంగా మియాపూర్ డివిజన్ ప్రభుత్వ పాఠశాల , మక్తమాబుపేటలో పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు పోటీ తత్వం పెంపొందించుకొని , క్రమశిక్షణ ,పట్టుదలతో మా ట్రస్టు అందిస్తున్న స్టడీ మెటీరియల్ ను సద్వినియోగపరచుకున్నట్లయితే పదవ తరగతిలో మంచి మార్కులు సాధిస్తారు, గొప్ప గొప్ప చదువులు చదివి భవిష్యత్తులో మీరు ఉన్నత స్థాయికి వెళ్లి సమాజానికి సేవ చేయాలంటూ విద్యార్థిని, విద్యార్థులు ఉద్దేశించి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ గారు మాట్లాడారు .ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాగుల గౌడ్, మాణిక్ రావు, రాజేష్ గౌడ్, లక్ష్మణ్ ముదిరాజ్, గుండె గణేష్ ముదిరాజ్ ,రామకృష్ణారెడ్డి ,కిరణ్, రాము, సురేష్ , మల్లేష్nk రవికాంత్ ,మాన్యం ,పవన్ యాదవ్,ముఖేష్ గౌడ్, అభిషేక్, మొదలగురు పాల్గొన్నారు
Comment List