ఉరకలేస్తున్న యువతరం

ఉరకలేస్తున్న యువతరం

లోక‌ల్ గైడ్:
గత సంవత్సరానికి గుడ్ బై అంటూ,
నూతన సంవత్సరానికి వెల్కమ్ అంటూ,వార్తాపత్రికల్లో వార్త లెన్నో,
డిసెంబర్ 31st రోజు ఎవరి మాట వినమంటున్న నేటి యువతరం
అగుపిస్తున్నది వార్త పెద్ద అక్షరాలతో ...

సంబరాల కోసం యువత హడావిడి 
ఎక్కడ చూసినా అంతటా సందడే
పల్లెలు పట్టణాల్లో కూడా అదే జోరు
మద్యానికి అడ్డుకట్ట వేయాల్సిందే,
ఓరి నాయనో లేకుంటే ఎలాంటి
వింత సంఘటనలు జరుగుతాయో?...

పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్చరికలు 
ఆంక్షలు అధిగమిస్తే ఇక కఠిన శిక్షలు వేస్తామంటున్న పోలీస్ అధికారులు 
పెద్దలు ఉగాది సంవత్సరాది అంటారు 
కానీ ఈనాటి యువతరం అవేవీ పట్టించుకోకుండా జనవరి ఫస్ట్ రోజే ముద్దంటున్నారు గట్టిగా ప్రశ్నిస్తే
కన్న తల్లిదండ్రులను ఎదిరిస్తున్నారు...

మద్యం మత్తులో పబ్బుల్లో, క్లబ్బుల్లో ఆడిపాడుతున్నారు నేటి యువత
ఎవరు ఏమి చెప్పినా  డోంట్ కేర్ మేము చెప్పిందే జరగాలి అంటూ యువత
నాటి యువత ప్రశాంతతకు ఆదర్శం
నేటి యువత కోపానికి నిదర్శనం
నాటి యువత జీవితం గౌరవప్రదం...

నేడు యువతను కంట్రోల్ చేయడం కష్టంగా మారింది పోలీసు వారికి
నేటి యువత జీవితం దిన దిన గండంగా మారి బాధిస్తున్నది,
నాటి యువత సాంప్రదాయాలకు పెద్దపీట వేసేవారు,నేటి యువత గొడవలు,దాడులకు కారకులైరి 
యువతరం మారేది ఎప్పుడో
వారిలో మార్పు వచ్చేది ఎప్పుడో
అంటూ ఆశగా ఎదురుచూస్తున్న జన్మనిచ్చిన తల్లిదండ్రులు..

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు   దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు 
లోకల్ గైడ్:హైద‌రాబాదులోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ సమైక్య ప్రారంభమైందని తొలి వెలుగు మహాసభలకు...
మ్యాగ్నెట్  ఆఫ్ ఎక్సలెంట్ స్కూల్లో ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్
నల్గొండ మాతా శిశు సంరక్షణ కేంద్రానికి మహర్దశ
.....ఓ శక్తి స్వరూపిణి...... 
నస్కల్లో వెల్లివిరిసిన మత సామరస్యం
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి 
షాద్ నగర్ లో జ్యూస్ వరల్డ్ అండ్ పార్లర్ షాప్ ప్రారంభం