శ్రీ‌తేజ్ ను చూడ‌గానే పుష్ప రియాక్ష‌న్ ......

శ్రీ‌తేజ్ ను చూడ‌గానే పుష్ప రియాక్ష‌న్ ......

లోక‌ల్ గైడ్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ మంగళవారం ఉదయం బేగంపేట కిమ్స్ ఆస్పత్రి కి వెళ్లారు. సంధ్య థియేటర్‌ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్‌ను పరామర్శించారు. అయితే పోలీసుల సూచనల ప్రకారం ముందుగా వారికి సమాచారం ఇచ్చి ఆయన ఆస్పత్రికి బయలుదేరి వెళ్ళారు. గత 35 రోజులుగా కిమ్స్‌ ఆస్పత్రిలోనే శ్రీతేజ్‌ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. పోలీసుల అనుమతితో అల్లు అర్జున్‌ కిమ్స్‌ ఆసుపత్రికి వచ్చారు. ఈ క్రమంలో కిమ్స్‌ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ప్రముఖ నిర్మాత దిల్ రాజు  కూడా కిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. కాగా అల్లు అర్జున్‌‌కు హైదరాబాద్, రాంగోపాల్‌పేట్ పోలీసులు  మరోసారి నోటీసులు అందించారు. సంధ్య థియేటర్తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించాలంటే ముందుగా తమకు సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బాలుడిని చూసేందుకు ఎప్పుడు రావాలనుకున్నా.. ముందుగానే ఇన్‌ఫర్మేషన్ ఇవ్వాలని, ఆ తర్వాత మాత్రమే అక్కడికి వెళ్లాలని సూచించారు.

కిమ్స్ ఆస్పత్రికి అల్లు అర్జున్ ఎప్పుడు వద్దామనుకున్నా తాము భద్రత కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాంగోపాల్ పేట్ పోలీసులు తెలిపారు. కానీ గంట లోపలే ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేలా ఆయన చూసుకోవాలని సూచించారు. సందర్శనంత గోప్యంగా ఉంచాలని, ఇటీవల జరిగిన దురదృష్టకర ఘటన దృష్టిలో ఉంచుకొని సహకరించాలని కోరారు. సమాచారం ఇవ్వకుండా ఆస్పత్రికి రావొద్దంటూ తెలిపారు. ఒకవేళ అలా వెళ్తే జరిగే పరిణామాలకు అల్లు అర్జునే బాధ్యత వహించాలని పోలీసులు పేర్కొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్
లోక‌ల్ గైడ్ :  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్.స్పోర్ట్స్ పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్న...
దేశ భవిష్యత్తు యువతతో మారుతుంది -  ABVP
మ‌రో దిగ్గజ ఆగటాడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
మాజీ ఎంపీపీ సుదర్శన్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 
సేవాలాల్ సేన  నూతన గ్రామ కమిటీ 
సంబరాలు ఎక్కడ ఓ మనిషి?
విశాఖ‌కు చేరుకున్న ప్ర‌ధాని మోదీ...