ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సైన్ బర్డులు పెట్టాలి మంత్రి పొన్నం ప్రభాకర్
లోకల్ గైడ్: జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు లో భాగంగా తెలంగాణ లో గ్రామగ్రామాన రహదారి భద్రత పై అవగాహన కల్పించాలని సూచించారు. నిన్నటి నుండి ప్రారంభమైన రహదారి భద్రతా మాసోత్సవాలు జనవరి 31 వరకు జరగనుండడంతో జిల్లాల్లో చేసే కార్యక్రమాలు వివిధ డిపార్ట్మెంట్ ల సమన్వయంతో సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్ లతో విడియో కన్ఫరెన్స్ నిర్వహించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, రవాణా శాఖ అధికారులు ,ఆర్టీసీ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.తెలంగాణ లో ప్రతి రోజూ రోడ్డు ప్రమాదాల్లో 20 మంది మరణిస్తున్నారని దానిని పూర్తిగా తగ్గించడానికి అందరూ కలిసి పని చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు ప్రధానంగా అధిక వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ విశ్రాంతి లేకుండా డ్రైవింగ్ నడపడం లాంటి కారణాలవల్ల 80 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ట్రాఫిక్ నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. రోడ్డు నిబంధన ఉల్లంఘించిన వారిపై లైసెన్సులు రద్దు చేస్తున్నాం. అలాగే చేస్తే జైలు శిక్ష విధించబడుతుందనీ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.7 వ తేది రోడ్డు భద్రత పై జాతీయ మాసోత్సవాల్లో భాగంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ సమావేశంలో చర్చిస్తామన్నారు.రహదారి భద్రతా పై జిల్లా స్థాయిలో నిర్వహించాల్సిన కార్యక్రమాల పై దిశా నిర్దేశం చేశారు.జిల్లాల్లో అవగాహన సదస్సులు , సెమినార్లు , వర్క్ షాప్ లు నిర్వహించాలి ,పాఠశాల లు ,కాలేజీలు ,గురుకుల విద్యా సంస్థలు ,వృత్తి శిక్షణ సంస్థల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రహదారి భద్రతా నిబంధనల పై ప్రచార రథాలు,పోస్టర్ క్యాంపెయిన్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రమాదాలు నివారించడానికి ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన కల్పించడం, ప్రమాద ప్రదేశాలను గుర్తించి సైన్ బోర్దులు ఏర్పాటు చేయడం ,ముఖ్య రహదారుల్లో రహదారి నిబంధనల పర్యవేక్షణ చేయాలి.అతివేగం,మద్యం సేవించి వాహనాలు నడపడం , మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న వారిపై ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు, హెల్మెట్ , సీట్ బెల్ట్ ల వినియోగం కఠిన నియమాలు అమలు చేయడం చేయాలన్నారు. రవాణా శాఖ,ఆర్ అండ్ బి శాఖ , పోలీస్ శాఖ, పాఠశాల విద్యా శాఖ,నేషనల్ హైవేస్ అథారిటీ, ఇతర సంబంధిత శాఖలతోజిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయాలి. జిల్లాలో మంత్రులు ,ఎమ్మెల్యేలు, ఎంపీలు స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రముఖ వ్యక్తులను రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగస్వామ్యం చేయాలి, స్థానిక ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. పాఠశాల విద్యార్థులకు డ్రాయింగ్, వ్యాసరచన , రహదారి భద్రతా పై క్విజ్ పోటీలు నిర్వహించాలి పాఠశాల విద్యార్థుల చేత జిల్లా ,మండల కేంద్రాల్లో భారీ ర్యాలీ , హెల్మెట్ ధరించిన వాహనదారుల తో బైక్ ర్యాలీలు తీయాలి. విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో ట్రాఫిక్ చిల్డ్రన్ అవగాహన పార్క్ ఏర్పాటు చేసేలా చూడాలి ఇందుకు సంబంధిత జిల్లా కలెక్టర్,జిల్లా విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకోవాలి. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ట్రాఫిక్ కూడళ్ళ వద్ద అవగాహన బోర్డు లు , ఫ్లెక్సీ లు ఏర్పాటు చేయాలి డ్రైవర్లకు హెల్త్ క్యాంప్ లు ఏర్పాటు చేయాలి. టోల్ గేట్ల వద్ద వాహనదారులు సీట్ బెల్ట్ ధరించడం రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించాలి.సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్,జిల్లా కలెక్టర్లు ,సీపీ లు , ఎస్పీ లు,రవాణా శాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు, డీఈవో లు ,పంచాయతీ రాజ్ అధికారులు ,బీసీ సంక్షేమ శాఖ అధికారులు , మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
Comment List