జనవరి 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం,కొత్త రేష‌న్ కార్డులు :  సిఎం రేవంత్ రెడ్డి

లోక‌ల్ గైడ్: ప్రతి ఎకరాకు రైతు భరోసా కింద రూ.12 వేలు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. అన్న‌దాతలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు మొండి చేయి చూపింది. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు. రైతు భరోసా కింద ప్రతి ఏటా ఎకరానికి రూ.12 వేలు ఇస్తామని సీఎం తెలిపారు. 2023లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎకరానికి రూ.15వేలు రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ, సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. వానాకాలం, వేసంగి సీజన్లకు కలిపి ప్రతి ఎకరాకు రైతు భరోసా కింద రూ.12 వేలు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందని అన్నారు. భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా ఏటా రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పేరు పెట్టారు. జనవరి 26 నుంచి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేస్తామన్నారు. ఇక రాష్ట్రంలో రేషన్ కార్డులు లేని వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు.మైనింగ్‌, రియల్‌ ఎస్టేట్ భూములకు రైతు భరోసా వర్తించదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ భూములు సాగు చేసినా, చేయకపోయినా రైతు భరోసా వర్తిస్తుందని చెప్పారు. రైతు భరోసా అమలులో ఎటువంటి కోతల్లేవని, అందరికీ ఈ పథకం అమలవుతుందన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News