శ్రీ చైతన్య విద్యాసంస్థలు జేఈఈ మెయిన్స్ , ఓపెన్ క్యాటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు

 శ్రీ చైతన్య విద్యాసంస్థలు జేఈఈ మెయిన్స్ , ఓపెన్ క్యాటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు

లోకల్ గైడ్:

హైదరాబాద్ శ్రీ చైతన్య విద్యాసంస్థలు జేఈఈ మెయిన్స్ , ఓపెన్ క్యాటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు హ్యాట్రిక్ సాధించినందుకు విజయోత్సవ ర్యాలీ , రోగులకు ఫ్రూట్స్ పంపిణీ , మానసిక వికలాంగులకు పండ్ల పంపిణీ , నగదు సహాయం లోకల్ గైడ్  దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జేఈఈ మెయిన్స్ (JEE Mains ) ఓపెన్ క్యాటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ (1st) ర్యాంకు హ్యాట్రిక్ గా 2023, 2024 & 2025 సంవత్సరాలకు మన హైదరాబాద్ శ్రీ చైతన్య విద్యాసంస్థలు సాధించడం జరిగింది మరియు ఓపెన్ క్యాటగిరీలో ఆల్ ఇండియా 100 లోపు 10 మంది విద్యార్థులు , 500 లోపు 31 మంది విద్యార్థులు ,1000 లోపు 40 మంది విద్యార్థుల తో పాటు వివిధ క్యాటగిరి లో ఒక్క హైదరాబాదు నుంచి వందలోపు 46 మంది విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించడం జరిగింది . ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన ఖమ్మం పట్టణం నందు  సోమవారం రోజు ఉదయం 9 గంటలకు శ్రీ చైతన్య విద్యా సంస్థల జిఎం గౌరవనీయులు శ్రీ నాగేంద్ర మరియు శ్రీ చైతన్య విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ ఎజిఎం శ్రీ రవి కుమార్ ల ఆధ్వర్యంలో నయాబజార్ సెంటర్ నుండి భారీ మోటార్ సైకిల్ మరియు కార్ల ర్యాలీ దాదాపు 1000 మంది హైదరాబాద్ శ్రీ చైతన్య విద్యాసంస్థల ఖమ్మం పట్టణానికి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు హైదరాబాద్ శ్రీ చైతన్య విద్యాసంస్థలకు సంబంధించిన ఏజీఎంలు , డీన్లు , అధ్యాపక , అధ్యాపకేతర సిబ్బంది తో నిర్వహించడం జరిగింది . ఉదయం 10 గంటల 45 నిమిషాలకు గవర్నమెంట్ హాస్పిటల్ నందు పేషెంట్స్ కు పండ్ల పంపిణీతో పాటు అన్నం ఫౌండేషన్ లో ఉన్న అనాధలు మరియు మానసిక వికలాంగులకు పండ్ల పంపిణీ తో పాటు నగదు సహాయం చేయడం జరిగింది . ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ఖమ్మం పట్టణ పుర ప్రజలకు , తల్లిదండ్రులకు , శ్రీ చైతన్య హైదరాబాద్ కుటుంబ సభ్యులకు మరియు పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు .

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నూతన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం నూతన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం
లోకల్ గైడ్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన భూభారతి - చట్టం 25, అవగాహన రెవెన్యూ సదస్సు మంగళవారం, దంతాలపల్లి మండల కేంద్రం...
భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు
భూ వివాదాల పరిష్కారానికి 'భూభారతి' దోహదం:
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల విచారణ వేగవంతం చేయాలి
టిడిపి సభ్యత కార్డుల పంపిణీ 
ఎల్‌వోసీ వ‌ద్ద క్వాడ్‌కాప్ట‌ర్‌ను కూల్చివేసిన పాకిస్థాన్ ఆర్మీ
Telangana Village Songs | Latest Folk Songs #shorts #latestfolksongs #pallepatalu #lgmedia