టిడిపి సభ్యత కార్డుల పంపిణీ 

నల్లగొండ జిల్లా ప్రతినిధి

టిడిపి సభ్యత కార్డుల పంపిణీ 

లోకల్ గైడ్ :

నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సభ్యత్వం కార్డుల పంపిణి కార్యక్రమం నల్గొండ పార్లమెంట్ కన్వినర్  కసిరెడ్డి శేఖర్ రెడ్డి  నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర మాజీ ప్రధానకార్యదర్శి  తుమ్మల మధుసూదన్ రెడ్డి  హాజరై కార్డుల పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1985 లో దేశ చరిత్ర లోనే సభ్యత్వం నమోదు కార్యక్రమం ప్రారంభించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. అప్పటి నుండి ప్రతి రెండు సంవత్సరాలకు సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపట్టి కార్యకర్తలకు ప్రమాదబీమా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కోసం నారా చంద్రబాబు నాయుడు  ఈ  ప్రమాదబీమా ప్రవేశ పెట్టినట్లు  వారు  తెలిపారు. ఈ సభ్యత్వ కార్డు  కార్యకర్త కు ధైర్యం అని  అనుకోని పరిస్థితుల్లో  కార్యకర్తకు ఏమైనా అయితే ఈ కార్డు కార్యకర్త కుటుంబానికి చేయూత నిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకునూరి సత్యనారాయణ, గుండు వెంకటేశ్వర్లు,  ఎం, కె  ఐ సిద్ధిక్, బక్కతోళ్ళ ఇస్తారి, గోగుల నాగరాజు, ఆరేళ్ళ కొండల్, భూతం వెంకటయ్య,  భూతం మంజుల తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69* *వర్ధంతి వేడుకలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69* *వర్ధంతి వేడుకలు
    వికారాబాద్ జిల్లా లోకల్ గైడ్: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ మార్గ వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా  అంబేద్కర్ గారి విగ్రహానికి
కీర్తి శేషులు తాండ్ర వీరేందర్ రెడ్డికి నివాళులు అర్పించిన లోకల్ గైడ్ దిన పత్రిక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చిలకమర్రి రాంరెడ్డి
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆర్‌పి‌ఐ (అథవాలే) కార్యక్రమాలు
ఘనంగా సదర్  ఉత్సవాలు
ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర స్థాయి సమీక్ష: జిల్లా కలెక్టర్లతో మంత్రుల సమావేశం
బాల్య వివాహాలు చట్ట వ్యతిరేకం ఐసిడిఎస్ సూపర్వైజర్ ఏ శారధ *   
బోసిపోయిన జిన్నింగ్ మిల్లులు.