భూ భారతి, కొత్త ఆర్ ఓఆర్ చట్టం అమలుపై సమావేశం
లోకల్ గైడ్:
మంగళవారం రంగారెడ్డి జిల్లా సమీకృత సముదాయ భవనంలోని సమావేశం మందిరంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తీసుకొచ్చిన ‘భూ భారతి’ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అదనపూ కలెక్టర్ ప్రతిమా సింగ్, డిఆర్‌డిఓ సంగీత, ఆర్డీఓలు అనంతరెడ్డి, చంద్రకల, జగదీశ్వర్ రెడ్డి, వెంకట్ రెడ్డి లతో, మున్సిపల్ కమీషన్లర్లతో, మండలాల ఎమ్మార్వోలతో, భూ భారతి, కొత్త ఆర్ ఓఆర్ చట్టం అమలుపై సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్.ఓ.ఆర్)- భూమి హక్కుల రికార్డు, భూ భారతి - కీలక అంశాలు, భూ భారతి - ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు, ఆర్.ఓ.ఆర్. లో తప్పుల సవరణ, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ & మ్యుటేషన్, వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్, ఇతర మార్గాల ద్వారా వచ్చిన భూమికి మ్యుటేషన్, సాదా బైనామాల క్రమబద్దీకరణ, పట్టాదారు పాసుపుస్తకాలు, అప్పీల్ వ్యవస్థ, రివిజన్ అధికారాలు, న్యాయ సహాయం, గ్రామా రెవిన్యూ రికార్డులు వంటి పలు అంశాలపైన రెవెన్యూ అధికారులకు ప్రొజెక్టర్ కలెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు.
భూమిపై ఎవరికి, ఎలాంటి హక్కుల వివరాలు, గ్రావాల వారిగా గ్రామంలో ఉన్న భూమి యజామానులు, వారు కలిగి ఉన్న భూమి వివరాలను తెలిపే రికార్డు అని అన్నారు. అంతే కాకుండా దీన్ని భూయజమానుల రికార్డు కూడా అన్నవచ్చన్నారు. నేటి నుండి ప్రతి భూముల రిజిస్ర్టేషన్ ఈ రికార్డు ఆదారంగానే జరుగుతుందన్నారు. ప్రభుత్వం రైతులకు చేసే మేలు ఏదైన దీని ప్రకారమే అందబడుతాయన్నారు. ఈ రికార్డులో పేరు ఉన్న వారికే భూ యాజమాన్య హక్కు పత్రం, పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వడం జరుగుతుందన్నారు.
జిల్లాలో వివాద రహిత భూ విధానాలు ఉండాలన్నదే ప్రభుత్వ ప్రయత్నమని స్పష్టం చేశారు. ఆధార్ తరహాలో భవిష్యత్‌లో భూమికి సంబంధించి సర్వే చేసి కొలతలు, హద్దుల వంటి సమగ్రమైన వివరాలతో ‘భూధార్’ తీసుకురాబోతుందని అన్నారు. ప్రజా పోరాటాల నుంచి పుట్టుకొచ్చిన రెవెన్యూ చట్టాలు, ప్రజల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం కావున ప్రతి ఒక్క రైతులకు, పౌరులకు ప్రణాళిక రూపంలో వివరించాలన్నారు.
పైలట్ ప్రాజెక్టుగా భూ భారతిని జిల్లాలో చేపట్టడానికి ముందుగా 8 నియోజకర్గాల్లలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత రెవెన్యూ అధికారులపైనే ఉందని, రెవెన్యూ అధికారులను ప్రజలకు చేరువ చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు..
ప్రతి నియోజకవర్గం, రెవెన్యూ డివిజన్ పరిధి, మండలాల పరిధిలో, ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన చేయించాలన్నారు. రెవెన్యూ శాఖపైన సృష్టించిన అపోహలను తొలగించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు..
గ్రామాలు, మండలాల్లో ప్రజా దర్బార్లు, రెవెన్యూ సదస్సులు నిర్వహించడం ద్వారా అవగాహన కల్పించాలి. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ వివిధ శాఖల అధికారుల సహకారంతో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడం కోసం కలిసి కట్టుగా పనిచేయాలన్నారు.
Comment List