ఆర్చరీ రాష్ట్రస్థాయి క్రీడల్లో విజయాన్ని కైవసం చేసుకున్న భద్రాచలం ఐటిడిఏ.

జాతీయస్థాయి క్రీడల్లో కూడా విజయం సాధించాలని ఐటీడీఏ పీవో బి రాహుల్.

ఆర్చరీ రాష్ట్రస్థాయి క్రీడల్లో విజయాన్ని కైవసం చేసుకున్న భద్రాచలం ఐటిడిఏ.

లోకల్ గైడ్ :వైజాగ్ లోని గీతం యూనివర్సిటీలో వివిధ రాష్ట్రాలు పాల్గొన్న రాష్ట్రస్థాయి గిరిజన ఆర్చరీ క్రీడలలో ఐటీడీఏ భద్రాచలం ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించడం చాలా సంతోషకరమని క్రీడల యొక్క విజయాత్ర ఇంతటితో ఆగకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడలలో పాల్గొని భద్రాచలం ఐ టి డి ఏ కు మంచి గుర్తింపు తీసుకొని రావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్  అన్నారు తన ఛాంబర్ లో ఏప్రిల్ 25, 26, 27 తేదీలలో వైజాగ్ లో జరిగిన రాష్ట్రస్థాయి గిరిజన ఆర్చరీ క్రీడలలో ఆంధ్ర ప్రదేశ్,కేరళ, రాజస్థాన్, ఒరిస్సా, అండమాన్ నికోబార్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి గిరిజన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్న ఆర్చరీ క్రీడలలో భద్రాచలం ఐటీడీఏ తరపున ఆశ్చర్య క్రీడలలో పాల్గొని బంగారు పతకాలు సాధించి రాష్ట్రస్థాయి ఓవరాల్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్న క్రీడాకారులకు ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలలో గెలుపోటములు అనేది సహజమని ఆడే ప్రతి ఆట గెలవడానికి ప్రయత్నించాలని అన్నారు. టీం మొత్తం కలిసికట్టుగా ఉండి పీడీలు పీఈటీలు కొచులు విద్యార్థిని విద్యార్థులకు అందించిన సహాయ సహకారాలు, సలహాలు, సూచనల వలన ఇంతటి పెద్ద విజయం సాధించారని అన్నారు. విద్యార్థిని విద్యార్థులు తప్పనిసరిగా ప్రతిరోజు ఆర్చరీత్తోపాటు ఇష్టమైన క్రీడలలో పాల్గొని మీయొక్క ఆటను మెరుగుపరచుకొని అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని అత్యధిక పథకాలు సాధించి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సంపాదించుకోవాలని ఆయన అన్నారు. ఐటీడీఏ భద్రాచలం, గిరిజన సంక్షేమ శాఖ కచనపల్లి క్రీడా పాఠశాల నుండి 08 మంది క్రీడాకారులు పాల్గొన్నారనీ,04 మంది పీడీ,పీఈటీస్ కోచులుతో కలిపి12 మంది రాష్ట్రస్థాయి గిరిజన ఆర్చరీ క్రీడల్లో పాల్గొని అండర్ 19, అండర్ 20, సీనియర్, జూనియర్ బాలబాలికలు పాల్గొని క్రీడలలో విజయం సాధించి ఓవరాల్ ఛాంపియన్షిప్ గెలుచుకొని మన ఐటీడీఏ కు మంచి పేరు తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు మరియు పిడి, పిఈటి ,కోచులకు అభినందిస్తున్నట్లు ఆయన అన్నారు. పిల్లలు చదువుతోపాటు ఇష్టమైన క్రీడలలో తప్పనిసరిగా పాల్గొనాలని, క్రీడలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజన పిల్లలు దృఢంగా మంచి మేధాశక్తి కలిగి ఉంటారని, వారికి ఇష్టమైన క్రీడలలో తప్పనిసరిగా ప్రోత్సాహం అందిస్తే విజయం సాధించి మెడల్స్ సాధించి పెడతారని అన్నారు. మీకు కావాల్సిన క్రీడా మెటీరియల్స్ తప్పనిసరిగా అందిస్తానని ఆయన అన్నారు. అనంతరం రాష్ట్రస్థాయి ఆర్చరీ క్రీడలలో పాల్గొనీ మెడల్స్ సాధించిన విద్యార్థిని విద్యార్థులకు పథకాలు అందించి అందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాలరావు, అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ వెంకట్ నారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు నాగ శ్యామ్, హెచ్ఎం వెంకటేశ్వర్లు, కోచ్ మారెప్ప విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 ఎల్‌వోసీ వ‌ద్ద క్వాడ్‌కాప్ట‌ర్‌ను కూల్చివేసిన పాకిస్థాన్ ఆర్మీ ఎల్‌వోసీ వ‌ద్ద క్వాడ్‌కాప్ట‌ర్‌ను కూల్చివేసిన పాకిస్థాన్ ఆర్మీ
లోకల్ గైడ్: భార‌త్‌కు చెందిన క్వాడ్‌కాప్ట‌ర్‌ను పాకిస్థాన్ ఆర్మీ కూల్చివేసింది. ఎల్వోసీ వ‌ద్ద ఎయిర్‌స్పేస్ ఉల్లంఘించిన‌ట్లు పాక్ ఆరోపించింది. మ‌రో వైపు ఓ దౌత్య‌వేత్త‌తో పాటు ఏడుగురు...
Telangana Village Songs | Latest Folk Songs #shorts #latestfolksongs #pallepatalu #lgmedia
Uppal Balu Latest Interview | Uppal Balu unknown truths | Uppal Balu Interview |Pallavi Prashanth
రాముడి వంశ వృక్షం గురించి ఈ బాబు ఎంత చక్కగా వివరించాడో చూడండి | Lord Rama Family Tree | LG Films
కొడుకు కల నెరవేర్చేందుకు భూమి విక్రయించిన తండ్రి..
మనం కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలి.
దుర్గా మల్లేశ్వర స్వామి గా శివుడు..!