ప్రాణాలు తీస్తున్న రోడ్డుపై మురుగునీటిని తొలగించాలి.
గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వీడాలి.
మురుగు కాలవ ముందు కూర్చుని నిరసన తెలియజేసిన సిపిఎం.
లోకల్ గైడ్ :భద్రాచలం పట్టణం రాజుపేట కాలనీ నందు డ్రైనేజీ పూడిక తీయించాలని,కొత్త డ్రైనేజీ లు నిర్మించాలని, ప్రధానంగా యజ్ఞజా స్కూలు ముందు రోడ్డుపై ప్రాణాలు తీస్తున్న మురుగు నీటిని తొలగించాలని కోరుతూ సిపిఎం 20వ వార్డు కమిటీ ఆధ్వర్యంలో మురుగు నీటి వద్ద కూర్చుని నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా కాలనీలోని డ్రైనేజీలు పూడిక తీయడం లేదని, డ్రైన్లు అవసరం ఉన్న చోట నిర్మించాలని దరఖాస్తులు చేసుకున్నప్పటికీ గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోవడంలేదని ఇది సరైనది కాదు అని అన్నారు. ధనికులు నివాసముంటున్న ప్రాంతాలలోనే నిధులు కేటాయింపులుగాని, డ్రైనేజీ క్లీనింగులు గాని చేస్తున్నారని పేదలు నివాసం ఉన్న ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులు జరగటం లేదని విమర్శించారు. అవసరం లేని ప్రాంతాలలో, రియల్ ఎస్టేట్ దందా నడుపుతున్న వారి కోసం రోడ్లు నిర్మిస్తున్న గ్రామపంచాయతీ అధికారులు కాలనీలలో ప్రజలకు అవసరం ఉంది అని అడుగుతున్న చోట ఎందుకు డ్రైనేజీలు, రోడ్లు నిర్మించడం లేదు అని ప్రశ్నించారు.. వర్షాకాలం రాకముందే డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు గ్రామపంచాయతీ అధికారులు నిధులు కేటాయించాలని మారుమూల కాలనీలలో ఉన్న ప్రధాన సమస్యలపై కేంద్రీకరణ చేయాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కమిటీ సభ్యులు నాదెళ్ల లీలావతి, డి కనక శ్రీ, శాఖ కార్యదర్శి కాకా రమణ సభ్యులు మంగమ్మ, చుక్కమ్మ, రాధా, మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Comment List