భూ వివాదాల పరిష్కారానికి 'భూభారతి' దోహదం:

అందకూరు అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

భూ వివాదాల పరిష్కారానికి 'భూభారతి' దోహదం:

లోకల్ గైడ్ :

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. కుంటాల మండలంలోని అందకూరు గ్రామంలో మంగళవారం నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా భూభారతి చట్టంపై అధికారులు రైతులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ చట్టం ద్వారా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సాదా బైనామాల క్రమబద్దీకరణకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ వివరించారు. ధరణి వల్ల రైతులు ఎదుర్కొన్న ఇబ్బందుల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. మే 01నుండి అన్ని రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ అధికారులు హాజరై రైతు సదస్సులు నిర్వహిస్తారని, రైతులు తమ భూ సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చన్నారు. భూభారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు అవకాశం కూడా ఉందని తెలిపారు. తహసీల్దార్‌, ఆర్డీవోలు విచారణ జరిపి మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారని, ఏవైనా అభ్యంతరాలుంటే రైతులు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. దీనికోసం రెండంచెల అప్పీల్ వ్యవస్థను ప్రవేశపెట్టినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం కూడా అందిస్తామని చెప్పారు. ప్రతి భూమికి ఆధార్ తరహాలో భూధార్ నెంబర్ కేటాయించి, స్పష్టమైన హద్దులు, భూ పటాలతో కూడిన పట్టా పాస్‌బుక్కులు జారీ చేస్తామని తెలిపారు. భూ హక్కుల రికార్డులు పారదర్శకంగా ఉంటాయని తెలిపారు. ధరణి అమలుతో గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణలో వచ్చిన అంతరాన్ని భూభారతి పూడ్చిపెట్టిందని, ఇకపై ప్రతిసారి మ్యుటేషన్ జరిగినపుడే గ్రామ లెక్కల్లో మార్పులు ఆన్ లైన్ లో నమోదు కానున్నాయని వివరించారు. ఈ చట్టం అమలుతో వారసత్వ భూముల బదలాయింపు, పట్టాదార్ పాస్ పుస్తకాల మార్పిడి, పట్టాలలో తప్పుల సవరణ వంటి సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. అనంతరం సదస్సులో పాల్గొన్న ప్రజలు తమ వివిధ భూ సమస్యలను కలెక్టర్ కు వివరించారు. తహసిల్దార్ పరిధిలో పరిష్కారం సాధ్యమైన సమస్యలను అక్కడికక్కడే విచారించి పరిష్కరించేందుకు అధికారులను ఆదేశించారు. ఇతర సమస్యలను భూ భారతి చట్టం ప్రకారం పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, తహసిల్దార్ కమల్ సింగ్, ఎంపీడీవో లింబాద్రి, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నూతన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం నూతన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం
లోకల్ గైడ్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన భూభారతి - చట్టం 25, అవగాహన రెవెన్యూ సదస్సు మంగళవారం, దంతాలపల్లి మండల కేంద్రం...
భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు
భూ వివాదాల పరిష్కారానికి 'భూభారతి' దోహదం:
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల విచారణ వేగవంతం చేయాలి
టిడిపి సభ్యత కార్డుల పంపిణీ 
ఎల్‌వోసీ వ‌ద్ద క్వాడ్‌కాప్ట‌ర్‌ను కూల్చివేసిన పాకిస్థాన్ ఆర్మీ
Telangana Village Songs | Latest Folk Songs #shorts #latestfolksongs #pallepatalu #lgmedia