నూతన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం
ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్.
లోకల్ గైడ్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన భూభారతి - చట్టం 25, అవగాహన రెవెన్యూ సదస్సు మంగళవారం, దంతాలపల్లి మండల కేంద్రం శ్రీ సాయి బాలాజీ గార్డెన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలు గా ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.వీరబ్రహ్మచారి, రెవెన్యూ డివిజనల్ అధికారి గణేష్, తదితరులు హాజరై తెలంగాణ గీతం ఆలపించి, పిపిటి, చదివి రైతులకు భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అవహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ మాట్లాడుతూ నూతన భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుందని,రైతు సంక్షేమం కోసం రైతు భరోసా, రుణా మాఫీ, భూ భారతీ చట్టం, మహిళాలకు ఉచిత బస్సు ప్రయాణం, యువతకు స్వయం ఉపాధి ఆర్ధిక అభివృద్ధి కోసం రాజీవ్ యువ వికాసం పథకం, అమలు, అర్హులైన ప్రతి పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు, సన్న బియ్యం పథకం, బోనస్ పథకం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పంపిణీ, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు.మరిపెడకు వంద పడకల ఆస్పత్రి, డోర్నకల్ నియోజకవర్గంలో కోటి 50 లక్షలతో ఆస్పత్రులు,అంతర్గత అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వడ్డీ లేని రుణాల కింద కేవలం దంతాలపల్లి అధిక ప్రాధాన్యత కల్పించామన్నారు, రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ ద్వారా వారి దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు,నూతన ఆర్ఓఆర్ చట్టం ద్వారా హక్కుల రికార్డులు వివరాలను నమోదు చేసి పాసు బుక్ జారీ చేస్తారని,రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తుందని, దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చని స్పష్టం చేశారు.భూ సమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్ల పై భూ భారతి చట్టం ప్రకారం ఆప్పీల్ చేసుకునే అవకాశం ఉందని, రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయం పై కలెక్టర్ వద్ద, కలెక్టర్ నిర్ణయం పై భూమి ట్రిబ్యునల్ వద్ద అపీల్ చేసుకోవచ్చని, గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని గుర్తు చేశారు.అప్పీల్ వ్యవస్థ అందించిన తీర్పు తర్వాత కూడా సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టు వెళ్ళవచ్చని, దరఖాస్తుదారులకు అవసరమైన ఉచిత న్యాయ సలహాను ప్రభుత్వం అందిస్తుందన్నారు.జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ
భూ భారతి నూతన ఆర్ఓఆర్ చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి న్యాయమైన సేవలు, అందుతాయని, ఈ చట్టం ముఖ్యంగా విప్లవంతత్వం మైంది.గత ధరణిలో రెవిన్యూ అధికారులకు ఎలాంటి అధికారాలు లేవని అన్నారు.ప్రస్తుతం చట్టంలో అనేక సౌకర్యాలు కల్పించడం జరిగిందని, తద్వారా రైతులకు సులభతరమైన న్యాయమైన విస్తృత స్థాయిలో సహాయం అందుతుందన్నారు.క్షేత్రస్థాయిలో భూ సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం వెసులుబాటుకల్పించిందన్నారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.వీరబ్రహ్మచారి, మాట్లాడుతూ గత ధరణి పోర్టల్, నూతన చట్టంపై రైతులకు సవివరంగా తెలియజేశారు .మొదటి దశలో మహబూబాబాద్ జిల్లాలో దంతాలపల్లి మండలం భూభారతి చట్టం అమలు పైలెట్ ప్రాజెక్టు గా ఎంపిక అయినందున ఆదిశగా చర్యలు తీసుకుంటామన్నారు.ఈ రెవెన్యూ సదస్సులో ఏడి ఎస్ఎల్ఆర్ ఏ. నరసింహమూర్తి, డిఏఓ విజయనిర్మల, స్థానిక తహసిల్దార్ ఉప్పుల సునీల్ రెడ్డి,ఎంపిడిఓ వివేక్ రామ్, ఏఏంసి చైర్మెన్ బట్టు నాయక్, పిఏసిఎస్సీ చైర్మెన్ రామ్మోహన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Comment List