మనం కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలి.

ఉగ్రదాడి ఘటనపై హీరో అజిత్ కుమార్ స్పందించారు.

మనం కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలి.

లోకల్ గైడ్ :

కులమతాలకు అతీతంగా ఐకమత్యంతో ఉండాలి. ఉగ్రదాడి ఘటనపై హీరో అజిత్ కుమార్ స్పందించారు. పెహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్  తాజాగా స్పందించారు.


Ajith Kumar | పెహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్స్పందించారు. పర్యాటకులపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండిస్తూ, బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు.

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలను సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ పద్మభూషణ్ అవార్డును స్వీకరించారు.

ఈ సందర్భంగా అజిత్ మాట్లాడుతూ, పెహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజలంతా ఒకరినొకరు గౌరవించుకుంటూ, కులమతాలకు అతీతంగా ఐకమత్యంతో ఉండాలని పిలుపునిచ్చారు. ఈ దేశంలో పెహల్‌గామ్‌లాంటి దారుణ ఘటనలు మరల చోటుచేసుకోకూడదని ఆకాంక్షించారు.

అలాగే, పద్మ అవార్డుల కార్యక్రమంలో తాను సాయుధ దళాలను కలిసిన విషయాన్ని గుర్తు చేస్తూ, వారి త్యాగాలకు నమనాలు అర్పించారు. మనం ప్రశాంతంగా నిద్రపోవడానికి వారు చేసే త్యాగాలే కారణమన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News