జన విజ్ఞాన వేదిక వేసవి శిక్షణా శిబిరం ప్రారంభం
లోకల్ గైడ్ : నగరం లోని నిర్మల్ హృదయ పాఠశాల లో జన విజ్ఞాన వేదిక ,తెలంగాణ సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ కే మహేంద్ర కుమార్ ప్రారంభించారు. ఈ శిక్షణాశిబిరంలో" దేశమును ప్రేమించుమన్నా ...."గేయాన్ని ప్రముఖ రచయిత ,కవి,గాయకులు రౌతు రవి విద్యార్థులకు నేర్పించారు. అనంతరం ప్రధాన కార్నర్ యాక్టివిటీ అయిన "మిరాకిల్ ఎక్స్పోజర్ "ను ఎస్విఆర్ పురుషోత్తమరావు, అలవాల నాగేంద్రం ,పీ వీ అప్పారావు, వి మోహన్ నిర్వహించారు. దీనిలో గాజు పెంకుల పై నడవడం ,అరచేతిలో హారతి కర్పూరం ,నాలుక పై హారతి కర్పూరం వెలిగించి మింగడం, నాలుకలో త్రిశూలం గుచ్చుకోవడం, అరచేతిలో రంధ్రం మొదలైన అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. అలాగే "రోజుకో పద్యం" లో భాగంగా ప్రముఖ రచయిత్రి వురిమళ్ల సునంద తెలుగు పద్యాన్ని నేర్పించారు. అనంతరం "గణితంలో గమ్మత్తులు" గురిం చి నరసింహారావు, శివన్నారాయణ వివరించారు. పాఠశాల యాజమాన్యం వారు హాజరైన వారందరికీ మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకు జరిగింది . వారం రోజులపాటు ఇదే సమయంలో ప్రతిరోజు వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో జెవివి రాష్ట్ర ఉపాధ్యక్షులు అలవాల నాగేశ్వరరావు ,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్వీ రెడ్డి ,టి. శివన్నారాయణ ,రాష్ట్ర కమిటీ సభ్యులు డి అరుణశ్రీ, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి. మోహన్, కె రామారావు జిల్లా బాధ్యులు ఆర్ శ్రీరాములు, ఎన్ ఏసోబు ,పి.రామకృష్ణ ,టి రామకృష్ణ,అకడమిక్ కమిటీ కన్వీనర్ ఈ. వెంకటేశ్వర్లు ,డాన్ బాస్కో, తాత రాఘవయ్య, విజయలక్ష్మి, వీరనారాయణ, నాగేశ్వరరావు,టి పి ఎస్ కే బాధ్యులు విప్లవ కుమార్,వసుంధర, మల్లికా తదితరులు పాల్గొన్నారు.
Comment List