మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎం ఎల్ ఎ
లోకల్ గైడ్ : జగిత్యాల పట్టణ 15వ వార్డు శంకులపల్లి లో మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జగిత్యాల ఎం ఎల్ ఎ డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల అభివృద్ధికి ప్రభుత్వం తో కలిసి పనిచేస్తున్న అని ఏకకాలం లో 20 వేల కోట్ల రుణ మాఫీ అమలు చేసిన రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే అని, సన్న వడ్లకు 500 బోనస్ తో రైతులకు లబ్ది చేకూరుతుందని ఈ ప్రభుత్వం రైతు పక్ష పాతి ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన,మెప్మా ఎ ఓ శ్రీనివాస్,నాయకులు గిరి నాగభూషణం,అడువాల లక్ష్మణ్, గోలి శ్రీనివాస్,బాల ముకుందం, తోట మల్లికార్జున్, చెట్పల్లి సుధాకర్,బోడ్ల జగదీష్,కుసరి అనిల్,కూతురు రాజేష్ పిట్ట ధర్మరాజు కత్రోజ్ గిరి,శరత్ రావు, ములసపు మహేష్,ఏనుగుల రాజు,లింగారెడ్డి,కుసరి రాజు,రంగు మహేష్,రవి,రవి శంకర్,రైతులు,తదితరులు పాల్గొన్నారు.
Comment List