సరన్ నగర్ లో కార్పొరేటర్ అధికారుల పర్యటన
లోకల్ గైడ్ :
మచ్చబొల్లారం 133 డివిజన్‌లోని సరన్ నగర్,రాయల్ ఎన్‌క్లేవ్ లో గురువారం కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్, అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఇతర అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వారు రోడ్డును పరిశీలించారు. స్ధానికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.రాయల ఎన క్లేవ్ విల్లాస్ / ఫ్లాట్లు పెద్ద మార్గంలో నిర్మిస్తున్న భారీ వాహనాలను నడుపుతున్నందున మెయిన్ అప్రోచ్ రోడ్ పూర్తిగా దెబ్బతిందని రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు తెలిపారు. ఈ సందర్భంగా డిసీ, కార్పొరేటర్ లు మాట్లాడుతూ... దెబ్బ తిన్న రహదారి మొత్తం సంబంధిత బిల్డర్లతో చర్చించి బాగు చేయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వారు రాయల్ ఎన్‌క్లేవ్‌ను సందర్శించారు, అక్కడ ఓపెన్ నాలా / స్ట్రోమ్ వాటర్ డ్రెయిన్ వద్ద డెసిల్టింగ్ పనులు పరిశీలించారు. ఈ పనులు త్వరగా పూర్తి చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో డిఈ రఘు, ఎఇ రవళి, సురేందర్ రెడ్డి, గురుచరణ్, బాలాజీ, కెఎస్ ఎన్ మూర్తి,సుబ్బయ్య, రాధా చరణ్ తదితరులు పాల్గొన్నారు.
Comment List