ప్రజావాణి అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి..... అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ
*ప్రజావాణిలో అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్ లు
లోకల్ గైడ్:
ప్రజావాణిలో వచ్చిన అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి లు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలని అన్నారు. నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం గ్రామానికి చెందిన ఎం. వేంకటేశ్వర్లు, ఆచార్లగూడెం గ్రామ రెవెన్యూ నందు ఉన్న సాయిలక్ష్మి పారా బాయిల్డ్ రైస్ ఇండస్ట్రీస్ నుంచి వస్తున్న కాలుష్యం వల్ల పంట నష్టం, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, ఆ రైస్ మిల్లుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, అదనపు కలెక్టర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.ఖమ్మం నగరం ముస్తాఫానగర్ కు చెందిన షేక్ సైదమ్మ తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు. దాచాపురం గ్రామానికి చెందిన ఎం. రాజా ఇందిరమ్మ గృహ సమగ్ర సర్వేలో అక్రమాలు జరిగాయని, అనర్హులకు ఇండ్ల కేటాయింపు చేసి అర్హులకు అన్యాయం జరిగిందని తెలుపుతూ దరఖాస్తు చేసుకోగా, ఈఈ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఖమ్మం నగరానికి చెందిన ఎస్.కే. షాకీరబి తనకు కుటుంబ పోషణ కోసం రాజీవ్ వికాసం పథకం క్రింద క్యాంటీన్ ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, సంబంధిత అధికారులకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్వో ఏ. పద్మశ్రీ, కలెక్టరేట్ ఏవో అరుణ, జిల్లా అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.
Comment List