మైనర్లకు బైక్ ఇస్తే పేరెంట్స్ పై కేసులు..

లైసెన్స్ లేకుండానే  హై స్పీడ్ బైకులు నడుపుతూ పట్టుబడిన 31 మంది మైనర్లు...

మైనర్లకు బైక్ ఇస్తే పేరెంట్స్ పై కేసులు..

వారంలో 266 డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

ఈ ఏడాది మూడు నెలలలో 243 రోడ్డు ప్రమాదాలు ..84 మంది మృతి... 686 మందికి తీవ్రమైన గాయాలు

పోలీస్ కమిషనర్ సునీల్ దత్

లోకల్ గైడ్ :

రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా పోలీసు యంత్రాంగం స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏడు రోజుల్లో దాదాపు 31 మంది మైనర్ డ్రైవింగ్, 266 డ్రంకన్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులు, వెహికల్ ఓనర్లపై ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని పోలీస్ కమిషనర్ సూచించారు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోను వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. మైనర్లు యాక్సిడెంట్ చేసి ఎదుటి వ్యక్తి చనిపోతే, అతడికి బైక్ ఇచ్చిన యజమానికి 3 ఏండ్ల జైలు శిక్ష, జరిమానా తప్పదని హెచ్చరించారు.డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్స్ నడిపితే ఉపేక్షించే ప్రసక్తి లేదని, లైసెన్సు  లేనివారికి వాహనాలు ఇవ్వవద్దని యజమానులకు సూచించారు. మైనర్లు బైకులు నడిపి దొరికితే న్యాయస్థానంలో శిక్ష /జరిమానా తప్పదని అన్నారు. మైనర్లకు వాహనాలిచ్చే తల్లిదండ్రలపై సైతం కేసులు నమోదు చేస్తామని, మైనర్లు డ్రైవింగ్ చేస్తే తల్లిదండ్రులు బాధ్యత వహించాల్సి వుంటుందని పెర్కొన్నారు. ముఖ్యంగా లక్షలు ఖర్చుచేసి కొనుగోలు చేస్తున్న యువత దానిని నడపడానికి అవసరమైన డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం తీసుకోవడం లేదని, హై స్పీడుతో బైకులు నడుతున్నవారిలో మైనర్లే అధికం వున్నారని, ఉత్సాహంగా పరుగులు పెట్టే క్రమంలో యాక్సిడెంట్లకు కారణమవుతున్నారని, ఇలాంటి విషయాల్లో పిల్లలకు మంచిచెడు చెప్పాల్సిన భాధ్యత తల్లిదండ్రులపై వుందని అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని అన్నారు. ఈ ఏడాది మూడు నెలలలో 243 రోడ్డు ప్రమాదాలు జరిగితే ..84 మంది మృతి చెందారని,మరో 686 మందికి తీవ్రమైన గాయాలు అయ్యాయని పెర్కొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నూతన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం నూతన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం
లోకల్ గైడ్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన భూభారతి - చట్టం 25, అవగాహన రెవెన్యూ సదస్సు మంగళవారం, దంతాలపల్లి మండల కేంద్రం...
భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు
భూ వివాదాల పరిష్కారానికి 'భూభారతి' దోహదం:
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల విచారణ వేగవంతం చేయాలి
టిడిపి సభ్యత కార్డుల పంపిణీ 
ఎల్‌వోసీ వ‌ద్ద క్వాడ్‌కాప్ట‌ర్‌ను కూల్చివేసిన పాకిస్థాన్ ఆర్మీ
Telangana Village Songs | Latest Folk Songs #shorts #latestfolksongs #pallepatalu #lgmedia