స్నేహానికి అర్హులు
స్నేహానికి అర్హులు
మన అభిప్రాయాలకు
విలువ నిచ్చే వారు
మన హద్దులను
గౌరవించేవారు
మన మసెరిగి
మసులుకునే వారు
మన విజయోత్సవాన్ని
పంచుకునేవారు
మనల్ని బాధిస్తాయని
తెలిసిన మనకు
నిజాలు మాత్రమే
చెప్పేవారు
బాధల్లో ఓదార్పు
నిచ్చే వారు
ఎల్లవేళలా మనకు
మద్దతుగా నిలిచేవారు
మంచి పనులతో
మనలో స్ఫూర్తి నింపేవారు
మన మనశాంతిని
కాపాడేవారు
ఇచ్చింది మరిచి
పుచ్చుకున్నది జ్ఞాపకం
ఉంచుకునే వారు
ఆపదలో ఆదుకునేవారు
అపాయంలో అక్కున
చేర్చుకొనే వారు
విభేదాలు ఎన్ని ఉన్నా
విడిపోని వారు
భంథాన్ని కొనసాగించే వారు
వ్యాకులత తొలగించేవారు
ఆందోళనను తుంచేవారు
ఆనందాన్ని పెంచేవారు
పలుకుతూ మదిని
పులకరింపు చేసేవారు
తన మాటతో
మనోల్లాసాన్ని
కల్పించేవారు
ధైర్యం ఓదార్పునిచ్చి
కలత చెందిన మనసుకు
వెన్నెల్లా చల్లదనాన్ని
ప్రశాంతతను చేకూర్చేవారు
కంటికి దూరమైన
మనసుకు దగ్గర
ఉండేవారు
ఈ లక్షణాలున్న వారిని
స్నేహితులుగా
ఎంచుకుంటె
ఆబంధం బలంగా
ఉంటుంది.
జీవిత ఉద్యానవనంలో
అందమైన పుష్పం స్నేహం
స్నేహాన్ని ఆస్వాదిస్తాం
ఆనంద తీరాల్లో విహరిద్దాం
స్నేహదీపం వెలుగులో
సామాజిక దురాచారాలను
నిర్మూలిద్దాం.
మెరుగైన సమాజాన్ని
నిర్మిద్దాం
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం
కరీంనగర్9440245771
Comment List