ప్రతిపక్షాలు కళ్ళు తెరిచి పథకాలను చూడండి
కాంగ్రెస్ ఏం చేసిందో చూడండి అభివృద్ధి చూసి మాట్లాడండి
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు కోళ్ల వెంకటేష్ మాదిగ సూచన
వనపర్తి, లోకల్ గైడ్:
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు చేసిన అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలను ప్రతిపక్ష పార్టీలు కళ్ళు తెరిచి చూసి మాట్లాడాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దళిత నాయకుడు కోళ్ల వెంకటేష్ మాదిగ డిమాండ్ చేశారు, పదేపదే అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతం పై ఆయన తీవ్రంగా విమర్శించారు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందని మాట్లాడుతున్న ప్రతిపక్ష పార్టీల నాయకులకు ఆయన ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజా పాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఒకసారి ఆయన వివరించారు, ఏమి చేసిందో కాంగ్రెస్ పార్టీ చూడండి అని స్పష్టంగా రైతు రుణమాఫీ తో పాటు ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు ఇవ్వడం మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా బస్సులు ప్రయాణించే సౌకర్యంతో పాటు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ రైతు భరోసా కింద ఎకరాకు 6000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో చేయడం జరిగిందని అదేవిధంగా బీసీ కమిషన్ ఏర్పాటు కూడా ఈ తెలంగాణలో ఎంతో కాలం పెండింగ్ లో ఉన్న ఆ సమస్యను పరిష్కరించడం జరిగిందని ఆయన తెలిపారు, అదేవిధంగా బీసీ కులగణం సర్వేను చేపట్టి బీసీలకు రాజకీయాలలో 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు రిజర్వేషన్ వర్తింప చేయడం తెలంగాణలో రైతు కమిషన్ ఏర్పాటు విద్యా మిషన్ ఏర్పాటుతో పాటు వైశ్య కార్పొరేషన్,సన్న వడ్లు పండిస్తున్న రైతులకు గిట్టుబాటు ధరతోపాటు క్వింటాలకు అదనంగా 500 రూపాయల బోనస్ ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటి సంవత్సరం కాలంలోపే 55 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత డిఎస్సీ వెయ్యడమే కాక ఉద్యోగాలు కూడా భర్తీ చేయడం జరిగిందని గ్రూప్ 1 పరీక్ష ఈ రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని కోళ్ల వెంకటేష్ మాదిగ అన్నారు, అదేవిధంగా దశాబ్దాల కాలం నుంచి దళితులు ఎంతో కాలం పోరాటం చేస్తూ వచ్చినా కూడా ఏ ప్రభుత్వం పరిష్కరించని ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ సాధించిందని ఆయన ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు సూచించారు, అదేవిధంగా 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ కింద బ్యాంకుల్లో రైతుల అకౌంట్లో మొత్తం 21 వేల కోట్ల రూపాయలను జమ చేయడం జరిగిందని ఇప్పటికే రైతుల కోసం రైతు ప్రభుత్వంగా కాంగ్రెస్ యాభై ఐదు వేల కోట్ల రూపాయలు రైతు సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు, వీటితోపాటు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ జయ జయహే తెలంగాణ అధికారిక గేయం తెలంగాణ కవులు కళాకారులకు గుర్తింపు ఇవ్వడం కళాకారులకు పురస్కారం అందజేయడం తోపాటు గద్దర్ పేరిట నంది అవార్డును ప్రకటించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి దక్కిందని ఆయన సందర్భంగా తెలిపారు, అదేవిధంగా తెలంగాణలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ బీసీ విద్యార్థులకు డైట్ చార్జీలు కాస్మోటిక్ చార్జీలు పెంచిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కిందని పేర్కొన్నారు, వీటితోపాటు సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు మటన్, చికెన్ ప్రతినెల నాలుగు సార్లు అందించేందుకు ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకున్నదని ఆయన వివరించారు, అదేవిధంగా దావోస్ పర్యటన గత సంవత్సరం ఇప్పుడు కలిసి సుమారు రెండు లక్షల 20వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాన్ని పెట్టుబడులు తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమేనని కోళ్ల వెంకటేష్ వివరించారు, వీటితోపాటు ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు సుమారు 15 నుంచి 20వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి సాధ్యమైందని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 1వ తారీకు నుంచి 5వ తారీఖు లోపు జీతాలు క్రమం తప్పకుండా చెల్లించడం కూడా కాంగ్రెస్ పార్టీ గొప్ప విషయంగా ఆయన పేర్కొన్నారు, ఆరోగ్యశ్రీ సేవల కోసం గతంలో ఉన్న ఐదు లక్షల రూపాయల వైద్య సేవలను ఏకంగా 10 లక్షల పెంచుతూ ఇప్పటికి ఆరోగ్యశ్రీ పథకానికి కోసం 1000 కోట్ల బిల్లులు కూడా ప్రభుత్వం ఆస్పత్రులకు చెల్లించిందని ఆయన వివరించారు, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 55 లక్షల కుటుంబాలకు ఉచితంగా విద్యుత్తు కాక గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించడం అర్వో ఎఫ్ ఆర్ పట్టా భూములకు కూడా రైతు భరోసా ఇచ్చే సౌకర్యాన్ని కల్పించడం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఐదు లక్షల రూపాయల సహాయం అందిస్తూ ఇంటి నిర్మాణం చేపడుతుందని ఉగాది పండుగ నుంచి తెలంగాణలో దాదాపు రెండు కోట్ల మంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు రేషన్ షాపుల నుంచి ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని ఆయన పేర్కొన్నారు, అంతేకాక అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డును కూడా ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఉద్యోగ నియామకాల కోసం జాబ్ క్యాలెండర్ ను ప్రకటించిందని దాని ప్రకారం ఉద్యోగాల భర్తీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతుందని ఆయన వివరించారు, ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు చేస్తున్న ఈ తరుణంలో ప్రతిపక్ష పార్టీలు అనవసరమైన రాద్ధాంతం చేయడం తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని ఆయన హితో పలికారు, కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ గ్రామాలలో పట్టణ ప్రాంతాలలో ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలకు వివరించాలని ఆయన విద్యార్థి చేశారు, ఈ రాష్ట్ర బడ్జెట్ ను మించి గత ప్రభుత్వం అప్పులు చేసిందని పది సంవత్సరాల లో దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం దుష్ప్రచారం చేస్తుందని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు, ఇంత అప్పు ఉన్నప్పటికీ ప్రజా ప్రభుత్వం సమాజ స్థాపన కోసం పాటుపడుతూ ఆర్థిక సంక్షేభంలో గడ్డు పరిస్థితిలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు నడిపించడం విశేషమని అన్నారు, ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
Comment List