మారిన రూల్.. బౌలర్లు ఇక ఆ పని చేయవచ్చు
లోకల్ గైడ్:
బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 18వ సీజన్‌కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బౌలర్లకు శుభవార్త చెప్పింది. బంతికి లాలాజలం (ఉమ్మి) రాయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తేసింది. శనివారం నుంచి మొదలుకాబోయే ఐపీఎల్-18వ సీజన్ నుంచి ఈ నిబంధన అమలులోకి రానుంది. ముంబైలో జరిగిన కెప్టెన్ల సమావేశంలో బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉమ్మిపై నిషేధం ఎత్తివేత ఐపీఎల్-18నుంచి అమలు చేయనున్న బీసీసీఐ సారథులకూ శుభవార్త కెప్టెన్ల సమావేశంలో కీలక నిర్ణయాలు IPL | ముంబై : బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 18వ సీజన్‌కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బౌలర్లకు శుభవార్త చెప్పింది. బంతికి లాలాజలం (ఉమ్మి) రాయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తేసింది. శనివారం నుంచి మొదలుకాబోయే ఐపీఎల్-18వ సీజన్ నుంచి ఈ నిబంధన అమలులోకి రానుంది. ముంబైలో జరిగిన కెప్టెన్ల సమావేశంలో బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బోర్డు ప్రతిపాదనకు మెజారిటీ సారథులు అంగీకారం తెలిపారు. బంతిని రివర్స్ స్వింగ్ చేసే క్రమంలో బౌలర్లు బంతికి ఉమ్మి రాయడం గతంలో కొనసాగింది. కానీ కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఐసీసీ దీనిపై నిషేధాన్ని విధించింది. 2022లో ఆ నిర్ణయాన్ని శాశ్వతం చేసింది. అయితే దీనికి వ్యతిరేకంగా ఇటీవల కాలంలో ప్రస్తుతం ఆడుతున్న బౌలర్లతో పాటు మాజీలు సైతం గళమెత్తారు. చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా భారత పేసర్ మహ్మద్ షమీ ఈ అంశాన్ని ప్రస్తావించగా.. దక్షిణాఫ్రికా మాజీ పేసర్ ఫిలాండర్, కివీస్ దిగ్గజం టిమ్ సౌథీ కూడా అతడికి మద్దతు ప్రకటించారు. కాగా ఐసీసీ దీనిపై ఏ విధమైన ప్రకటన చేయకపోయినప్పటికీ ఉమ్మిపై నిషేధాన్ని ఎత్తేసిన తొలి మేజర్ క్రికెట్ బోర్డుగా బీసీసీఐ నిలిచింది. బీసీసీఐ నిర్ణయంతో ఐసీసీ కూడా త్వరలోనే దీనిపై పునరాలోచించే అవకాశం లేకపోలేదు.
Comment List