ఓజి ఓజి అనడం మానరా...: పవన్ కళ్యాణ్
లోకల్ గైడ్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులపై చిరునవ్వుతో వార్నింగ్ ఇచ్చారు. తాజాగా కర్నూలు జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉండగా ఓజి.. ఓజి అని పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్దపెద్దగా కేకలు వేశారు. అయితే వెంటనే మీరు మారరు రా బాబు అంటూ పవన్ కళ్యాణ్ చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు. నేనేదో రాజకీయం గురించి మాట్లాడుతుంటే మీరేంట్రా సినిమాలు గురించి మాట్లాడుతారు అన్న విధంగా అభిమానులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక తాజాగా కర్నూలు జిల్లాలోని పూడిచెర్లలో 1.55 లక్షల నీటి కుంటల నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. నీటిని సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పవన్ కళ్యాణ్ సూచించారు. నీటి విలువను ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని అన్నారు. ఇక చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను కూడా పటిష్టం చేస్తున్నామని చెప్పారు. కాగా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఏ కార్యక్రమం జరిగిన ఆ కార్యక్రమానికి భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానులు చేరుకుంటున్నారు. భారీ ఎత్తున అభిమానులు రావడమే కాకుండా పవన్ కళ్యాణ్ సినిమాల గురించి కేకలు వేయడంతో పవన్ కళ్యాణ్ చాలాసార్లు ఆపడానికి ప్రయత్నం చేశారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులపై ఏమాత్రం కోప్పడకుండా చిన్న చిరునవ్వుతో మీరు మారరు అంటూ జవాబు ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ పై మరింత ప్రేమ కలుగుతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి వైదొలిగి పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటానని తెలిపిన విషయం మనందరికీ తెలిసిందే.
Comment List