‘లుసిఫ‌ర్ 2’ సినిమాకి మోహన్‌లాల్‌ పారితోషికం ఎంత..!

‘లుసిఫ‌ర్ 2’ సినిమాకి మోహన్‌లాల్‌ పారితోషికం ఎంత..!

లోక‌ల్ గైడ్:

‘లుసిఫ‌ర్ 2’ సినిమాకి మోహన్‌లాల్‌ పారితోషికం ఎంతంటే.! మ‌ల‌యాళ న‌టుడు, ద‌ర్శ‌కుడు పృథ్వీరాజ్ సుకుమారన్  ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా చిత్రం ఎల్2 ఎంపురాన్. బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం లుసిఫ‌ర్ సినిమాకి ఈ చిత్రం సీక్వెల్‌గా వ‌స్తుంది.మ‌ల‌యాళ న‌టుడు, ద‌ర్శ‌కుడు పృథ్వీరాజ్ సుకుమారన్ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా చిత్రం ఎల్2 ఎంపురాన్. బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం లుసిఫ‌ర్ సినిమాకి ఈ చిత్రం సీక్వెల్‌గా వ‌స్తుంది. మలయాళీ సూపర్ స్టార్ మోహ‌న్ లాల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. మంజు వారియ‌ర్, టోవినో థామస్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా వ‌రుస ప్ర‌మోష‌న్స్‌లో పాల్గోంటున్నాడు పృథ్వీరాజ్. అయితే ఈ సినిమాకు మోహ‌న్ లాల్ తీసుకున్న పారితోషికం గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు పృథ్వీరాజ్.ఆయ‌న మాట్లాడుతూ.. ల‌ల్లెట్ట‌న్ (మోహన్‌లాల్) వ‌ల‌నే ఈ సినిమా సాధ్యమైంది. మోహన్‌లాల్ ఈ చిత్రం కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ఒక దర్శకుడిగా, నేను నిర్మాతల గురించి ప్రతి క్షణం ఆలోచిస్తాను. మనం ఖర్చు చేసే ప్రతి రూపాయికి విలువ ఇవ్వాలని భావిస్తాను. ‘లూసిఫర్‌ 2: ఎంపురాన్‌’ కోసం మోహన్‌లాల్ ఒక్క పైసా కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదు. ఆయన పారితోషికం వదులుకోవడం వల్లే ఈ సినిమా తెర‌కెక్కింద‌ని చెప్ప‌డంలో సందేహం లేదు. ఆయన రెమ్యూనరేషన్‌ను కూడా సినిమా నిర్మాణానికి ఉపయోగించాం. స్క్రీన్‌పై చూస్తే ఆ విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. గేమ్ ఆఫ్ థోర్న్స్ న‌టుడు జెరోమ్ ఫ్లిన్‌తో పాటు చాలా మంది విదేశీ నటులు ఇందులో పాల్గొన్నారు. వారంతా సినిమాకి చాలా స‌హకారం అందించారంటూ పృథ్వీరాజ్ చెప్పుకోచ్చాడు. 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి
లోకల్ గైడ్:జనగామ జిల్లా పాలకుర్తి మండలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు గురువారం రాత్రి...
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్న కేంద్రం బిజెపి ప్రభుత్వం 
పెంచిన గ్యాస్ ధర పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి..
ఏప్రిల్ 11న థియేట‌ర్‌ల‌లో 'ప్రేమకు జై' 
అందుకే మరో పెళ్లి చేసుకోవడం లేదు: రేణు దేశాయ్
17న జేఈఈ మెయిన్‌ ఫలితాలు 
రాజస్థాన్‌పై టైటాన్స్ భారీ విజయం